- Home
- Entertainment
- తండ్రి చనిపోతే తన స్కూల్ లో చదివించిన మోహన్ బాబు, ఆమె ఇప్పుడు 300 కోట్లు రాబట్టే క్రేజీ హీరోయిన్ అని తెలుసా ?
తండ్రి చనిపోతే తన స్కూల్ లో చదివించిన మోహన్ బాబు, ఆమె ఇప్పుడు 300 కోట్లు రాబట్టే క్రేజీ హీరోయిన్ అని తెలుసా ?
సినిమా రంగంలో మాత్రమే కాకుండా విద్యా రంగంలో కూడా మోహన్ బాబు తన ప్రత్యేకత చాటుకున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి వాటిని ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టాలీవుడ్ లో నటుడిగా ఎన్నో విలక్షణ విలక్షణమైన పాత్రల్లో నటించారు. కమెడియన్ గా, విలన్ గా, హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి నటనలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అభిమానులు మోహన్ బాబుని డైలాగ్ కింగ్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. సినీ రంగంలో మోహన్ బాబు నిర్మాతగా కూడా రాణించారు.
సినిమా రంగంలో మాత్రమే కాకుండా విద్యా రంగంలో కూడా మోహన్ బాబు తన ప్రత్యేకత చాటుకున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి వాటిని ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చేశారు. మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ పెదరాయుడు చిత్రంలో కలిసి నటించారు. ఒకసారి రజనీకాంత్ మోహన్ బాబుకి ఒక మాట చెప్పారట. ప్రేక్షకులు మన పట్ల విసిగిపోయే ముందే మన రిటైర్ అయిపోవాలి అని చెప్పారట.
నటుడిగా జీవితాంతం కొనసాగడం సాధ్యం కాదు. కొత్త వాళ్లు వస్తుంటారు. కాబట్టి మరొక వృత్తిని ఎంచుకోవాలి అనే ఆలోచన నాకు ఉండేది. ముందుగా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. కానీ అది కుదరలేదు అప్పుడే స్కూల్ ని మొదలుపెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఆ విధంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్ ని ప్రారంభించాను. ఇప్పుడు అది శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీగా మారింది.
నటుడిని కాకముందు నేను కనీసం రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితిని చాలా కాలం ఎదుర్కొన్నాను. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ కష్టం నాకు తెలుసు కాబట్టే నా విద్యాసంస్థల్లో 25 శాతం మంది పిల్లలకు ఉచిత విద్య, ఫీజు రాయితీలతో చదివిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు. టాలీవుడ్ లో చనిపోయిన నటులు, కమెడియన్ల పిల్లల్ని కూడా తన విద్యా సంస్థల్లో చదివించినట్లు మోహన్ బాబు తెలిపారు
ఒక అమ్మాయి తన స్కూల్లో చదువుకొని ఇప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్ గా ఎదిగిందని, ఆమె పేరు గుర్తు రావటం లేదని ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు ప్రస్తావించింది ఎవరి గురించో కాదు.. ఆమె క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. టాలీవుడ్ నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి.. ఐశ్వర్య రాజేష్ కి మేనత్త అవుతుంది.
ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ ఆమె చిన్నతనంలోనే మరణించారు. ఐశ్వర్య రాజేష్ తన తండ్రి మరణించిన తర్వాత శ్రీ విద్యానికేతన్ స్కూల్, తిరుపతిలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఆమె చెన్నైకి వెళ్ళింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్. ఆమె చివరగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంతో ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ మూవీలో వెంకీ, ఐశ్వర్య రాజేష్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.