- Home
- Entertainment
- భర్త ఉండగా అందరి ముందు శోభన్ బాబుకి ముద్దు పెట్టేసిన మహిళ.. అలా స్పందించడం ఆయనకే సాధ్యం, ఏం చేశారంటే
భర్త ఉండగా అందరి ముందు శోభన్ బాబుకి ముద్దు పెట్టేసిన మహిళ.. అలా స్పందించడం ఆయనకే సాధ్యం, ఏం చేశారంటే
నటి శివపార్వతి ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబుకి అప్పట్లో మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్తూ ఆసక్తికర సంఘటన రివీల్ చేశారు.

లెజెండ్రీ హీరో, టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకి మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శోభన్ బాబు స్థాయిలో మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. తన అందం, నటనతో శోభన్ బాబు చాలా కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో ఒకడిగా రాణించారు.
సీనియర్ నటి శివపార్వతి ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబుకి అప్పట్లో మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్తూ ఆసక్తికర సంఘటన రివీల్ చేశారు. ఒకసారి శోభన్ బాబు షూటింగ్ లో షాట్ కి రెడీ అవుతున్నారు. శోభన్ బాబుని చూడడానికి షూటింగ్ లోకేషన్ కి చాలామంది జనాలు వచ్చారు. తన భర్త, బిడ్డతో శోభన్ బాబుని చూడాలని ఓ మహిళ వచ్చింది. తన వద్ద ఉన్న బిడ్డని భర్తకు ఇచ్చేసి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి సడెన్ గా శోభన్ బాబుకి ముద్దు పెట్టేసింది.
దీంతో షూటింగ్ లొకేషన్ లో ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో శోభన్ బాబు రియాక్ట్ అయిన విధానం అద్భుతం.. అలాంటి ఔన్నత్యం శోభన్ బాబుకు మాత్రమే సాధ్యం అని శివ పార్వతి తెలిపారు. ఇంతకీ శోభన్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారంటే..తన అనుమతి లేకుండా ముద్దు పెట్టిన ఆ మహిళని శోభన్ బాబు ఏమీ అనలేదు. ఆమె భర్తని దగ్గరికి పిలిచారు. ఆమె భర్తకి శోభన్ బాబు ముద్దు పెట్టి ఫీలయ్యావా అని అడిగారు.
ఏమీ అనుకోకు నాపై పిచ్చి అభిమానం వల్లే నీ భార్య ఇలా చేసింది. అభిమానులు అంటే ఇలాగే ఉంటారు. ఒక కూతురు తన తండ్రికి ముద్దు పెట్టింది అనుకో అని శోభన్ బాబు అన్నారు.
ఆ సంఘటనపై శోభన్ బాబుకు అసలు స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆమె భర్తను పిలిచి వివరణ ఇచ్చి తన గొప్పతనం చాటుకున్నారు అని శివ పార్వతి అన్నారు. మహిళల ఆదరణతోనే శోభన్ బాబు నటించిన చాలా చిత్రాలు విజయం సాధించాయి.