- Home
- Entertainment
- 500 కోట్ల నష్టాన్ని అడ్డుకున్న రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?
500 కోట్ల నష్టాన్ని అడ్డుకున్న రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?
చరణ్, గౌతమ్ కాంబినేషన్ లో చిత్రం ఆగిపోవడానికి బలమైన కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో గతంలో ఒక చిత్రానికి ప్రకటన జరిగింది. క్రేజీ కాంబినేషన్లో మూవీ రాబోతోంది అనుకుంటున్న తరుణంలో ఈ చిత్రాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ టైంలో ఏం జరిగిందో మెగా అభిమానులకు అర్థం కాలేదు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఆ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించి ఉండేది.
అయితే అసలు రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని ఎందుకు వదులుకున్నాడు, వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే చర్చ ఫ్యాన్స్ లో ఇప్పటికి జరుగుతూనే ఉంది. అయితే సరైన కారణాలు మాత్రం ఎవరికీ తెలియదు. కానీ చరణ్, గౌతమ్ కాంబినేషన్ లో చిత్రం ఆగిపోవడానికి బలమైన కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్ సినిమా పై యువి క్రియేషన్స్ సంస్థ కొన్ని నెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసింది. దాదాపు అదే సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక చిత్రం ప్రారంభమైంది. ఆ చిత్రమే కల్కి 2898 ఎడి. ఆ చిత్ర కథ గురించి రామ్ చరణ్ కి, యు వి క్రియేషన్స్ సంస్థకి సమాచారం అందిందట. గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కోసం రెడీ చేసిన కథ కూడా దాదాపుగా కల్కి కథలానే ఉంటుందట. త్రేతా యుగం, ద్వాపర యుగంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా గౌతమ్ తిన్ననూరి కథ రూపొందించారట.
కలియుగంలో ఉన్న ఒక వీరుడు తన మూలాలు త్రేతా యుగం, ద్వాపర యుగంలో ఉన్నట్లు గుర్తించడం, యుద్ధానికి సంబంధించిన అంశాలు అతనికి గుర్తు రావడం లాంటివి కూడా ఈ కథలో ఉన్నాయట. దీంతో ఒకే తరహా కథతో ఒకే టైంలో రెండు చిత్రాలు రావడం కరెక్ట్ కాదని.. ఇద్దరికీ నష్టం జరిగే అవకాశం ఉందని రామ్ చరణ్ భావించారు.
దీంతో గౌతమ్ తిన్ననూరితో చర్చించి ఈ చిత్రాన్ని ఆపేయాలని ఇద్దరు అంగీకారానికి వచ్చారట. ప్రభాస్ కల్కి చిత్రం 500 కోట్ల బడ్జెట్ రూపొందింది. ఒకవేళ రామ్ చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరి చిత్రం చేసి ఉంటే ఈ రెండు చిత్రాలు వందల కోట్లు నష్టపోయే పరిస్థితి ఉండేది. దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేశారు. రామ్ చరణ్ తో సినిమా ఆగిపోయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి.. విజయ్ దేవరకొండకి రెండు కథలు నెరేట్ చేశారు. అందులో ఒకటి రామ్ చరణ్ తో చేయాలనుకున్న కథ కాగా.. మరొకటి త్వరలో రిలీజ్ కాబోతున్న కింగ్డమ్.
విజయ్ దేవరకొండ కూడా కల్కి 2898 ఎడిలో అర్జునుడిగా నటించారు. కాబట్టి కల్కి కథపై విజయ్ కి అవగాహన ఉంది. దీనితో ఈ కథ సేమ్ కల్కిలానే ఉందని.. అదే కథతో మరో సినిమా చేయడం ఎథికల్ కాదని భావించినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. అందుకే కింగ్డమ్ కథ ఎంచుకున్నట్లు విజయ్ పేర్కొన్నారు. జూలై 31న కింగ్డమ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.