MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Actor Naresh: ఆ వార్తలను ఖండించని నరేష్... క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో మూడో పెళ్లి నిజమేనా!

Actor Naresh: ఆ వార్తలను ఖండించని నరేష్... క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో మూడో పెళ్లి నిజమేనా!

నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ మూడో పెళ్ళికి సిద్దమయ్యారన్న వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ని ఆయన వివాహం చేసుకోనున్నారట. నరేష్ వివాహంపై వరుస కథనాలు వెలువడుతున్నా... నరేష్ ఖండించలేదు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 12 2022, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Actor Naresh

Actor Naresh

మౌనం అర్థాంగీకారం అంటారు. ప్రచారంలో ఉన్న ఓ పుకారును ఖండించకపోతే అది నిజం అవుతుంది. నరేష్ ఇప్పుడు మూడో పెళ్లి అనే టాపిక్ ని ఖండించలేదు. కనీసం చేసుకుంటున్నాను అంటూ క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో ఏం జరుగుతుందనే ఓ సస్పెన్సు కొనసాగుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

నరేష్ ప్రస్తుత వయసు 62 ఏళ్ళు. రెండు పెళ్లి చేసుకున్న నరేష్ మనస్పర్థలతో వారి నుండి విడిపోయారు. దీంతో ఒంటరిగా ఉంటున్న నరేష్ భార్యగా తనతో పలు చిత్రాలలో నటించిన పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

37

కృష్ణ రెండవ భార్య విజయనిర్మల మొదటి భర్త  కొడుకు నరేష్.  చిత్ర పరిశ్రమలో పుట్టి పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నరేష్ 80-90లలో హీరోగా రాణించారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. నరేష్ మొదటి వివాహంగా రేఖ అనే మహిళను వివాహం చేసుకున్నారు.
 

47


అనంతరం ఆమెతో విడిపోయారు. రెండో వివాహం రమ్య రఘుపతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇటీవల రమ్య రఘుపతి చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. కొందరు వ్యక్తుల నుండి కోట్లు వసూలు చేసినట్లు ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నరేష్ ఓ వీడియో ద్వారా రమ్యకు తనకు గల రిలేషన్ బయటపెట్టారు. ఒకప్పుడు ఆమె నాకు భార్యగా ఉన్న విషయం నిజమే... మేము విడిపోయి 5-6 ఏళ్ళు అవుతుంది. రమ్యతో గాని, ఆమె ఆర్థిక నేరాలతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. 

57

రమ్యతో విడిపోయినప్పటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ఆయన సన్నిహితంగా ఉంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. నరేష్ తన పలుకుబడి ఉపయోగించి ఆమెకు అవకాశాలు కూడా ఇప్పిస్తున్నారనే టాక్ ఉంది. తాజాగా వారిద్దరి వివాహం అంటూ వార్తలు వస్తున్నాయి. పవిత్ర లోకేష్ భర్త నుండి విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అందుకే నరేష్ తో వివాహానికి ఆమె సంశయిస్తున్నారు. ఎట్టకేలకు వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది అంటున్నారు. 

67

నరేష్ కి రెండు వివాహాల ద్వారా ముగ్గురు అబ్బాయిల సంతానం ఉన్నట్లు సమాచారం. పెద్ద కుమారుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా  వెండితెరకు పరిచయం అయ్యాడు. ఐనా ఇష్టం నువ్వు, ఊరంతా అనుకుంటున్నారు వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ రెండు చిత్రాలు పరాజయం పొందాయి. నరేష్ మూడో వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 
 

77


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా నరేష్ వ్యవహరించారు. 2021లో ఆయన పదవీకాలం ముగిసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణుకు మద్దతుగా నిలిచి అతన్ని గెలిపించాడు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మెగా ఫ్యామిలీ మద్దతున్న ప్రకాష్ రాజ్ ని కాదని మంచు విష్ణుని గెలిపించడం నిజంగా... గొప్ప విషయం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Recommended image2
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Recommended image3
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved