- Home
- Entertainment
- 5 ఎకరాల్లో మోహన్ బాబు లగ్జరీ హౌస్, ఇంద్ర భవనం కూడా దిగదుడుపే.. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూశారా
5 ఎకరాల్లో మోహన్ బాబు లగ్జరీ హౌస్, ఇంద్ర భవనం కూడా దిగదుడుపే.. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూశారా
ఇంద్ర భవనాన్ని తలపించే మోహన్ బాబు లగ్జరీ హౌస్ గురించి విశేషాలు ఈ కథనంలో తెలుసుకోండి. మోహన్ బాబు తాను ఈ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఎలా నిర్మించుకున్నానో వివరించారు.

అగ్ర నటుడిగా మోహన్ బాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తాను చాలా కిందిస్థాయి నుంచి ఎదిగానని పలు సందర్భాల్లో తెలిపారు. తిరుపతి సమీపంలో ఏర్పేడు మండలంలో మోదుగులపాలెం అనే చిన్న కుగ్రామంలో మోహన్ బాబు పుట్టి పెరిగారు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ లో అగ్ర నటుల్లో ఒకరు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా సినిమాల్లో రాణిస్తున్నారు.
KNOW
మోహన్ బాబు హోమ్ టూర్
తాజాగా కర్లీ టేల్స్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ సంస్థ మోహన్ బాబు ఇంట్లో హోమ్ టూర్ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో మోహన్ బాబు తన లగ్జరీ హౌస్ ని చూపిస్తూ తన లైఫ్ స్టైల్, బ్యాగ్రౌండ్, జీవితంలో ఎదిగిన విధానం, నటుడిగా సాధించిన ఘనతలు, జీవితాన్ని మార్చిన సంఘటనలు ఇలా అన్ని అంశాలని పంచుకున్నారు.
తన అభిరుచికి తగ్గట్లుగా మోహన్ బాబు నిర్మించుకున్న ఇల్లు
ముందుగా మోహన్ బాబు లగ్జరీ హౌస్ విషయానికి వస్తే ఆ ఇల్లు 5 ఎకరాల విస్తీరణంలో ఇంద్ర భవనాన్ని మించేలా హంగులతో ఆకర్షణీయంగా ఉంది. మోహన్ బాబు తన అభిరుచికి తగ్గట్లుగా ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణంలో ప్రతి విషయాన్ని తాను దగ్గరుండి చూసుకున్నానని అన్నారు. ఈ లగ్జరీ హౌస్ లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభింబించేలా నిర్మించినట్లు మోహన్ బాబు తెలిపారు.
ప్రతి కార్నర్ చెక్ చేస్తా
ఎంతో అందంగా కనిపించే గార్డెన్, ఇండోర్ లివింగ్ స్పేస్, స్పోర్ట్స్ ఏరియా, జిమ్ ఏరియా ఇలా అన్ని సౌకర్యాలు ఇక్కడ కనిపిస్తాయి. పరిశుభ్రత అంటే నాకు చాలా ఇష్టం. పరిశుభ్రత ఉన్న చోటే దైవత్వం కూడా ఉంటుందని తాను నమ్ముతానని మోహన్ బాబు అన్నారు. అందుకే ఇంట్లో ప్రతి కార్నర్ క్లీన్ గా ఉందా లేదా అని స్వయంగా తాను చెక్ చేస్తానని మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు ఇంట్లో పనివారు 25 మంది ఉన్నట్లు తెలిపారు.
మలేషియా నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోటార్ బైక్
ఇంటి లోపల మెట్లని ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. పాలిష్ వుడ్, మార్బుల్స్, అత్యంత ఖరీదైన మెటీరియల్స్ ఇంటిలోపల దర్శనం ఇస్తాయి. ఇంటి లోపల స్టైర్ కేస్ దగ్గర ఆకర్షణీయంగా ఉండే వుడెన్ మోటార్ బైక్ ఉంటుంది. దానిని మోహన్ బాబు మలేషియాలో ప్రత్యేకంగా డిజైన్ చేయించి తీసుకున్నారట. గతంలో బైక్స్ రైడ్ చేసే వాడిని కానీ.. యాక్సిడెంట్ తర్వాత బైక్స్ జోలికి వెళ్లడం లేదని మోహన్ బాబు అన్నారు.
రోజూ అరిటాకులోనే భోజనం
మోహన్ బాబు డైనింగ్ హాల్ కూడా విలాసవంతంగా ఉంటుంది. తాను రోజూ అరిటాకులోనే భోజనం తింటానని తెలిపారు. ఇంటికి ఎంత మంది అతిథులు వచ్చినా వారికి భోజనం తయారు చేయగల కెపాసిటీ ఉండే పెద్ద కిచెన్ ని కూడా అద్భుతంగా డిజైన్ చేయించారు. అదే విధంగా విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ కూడా మోహన్ బాబు ఇంట్లో ఉంది.
అందుకే క్రమశిక్షణ అలవాటు అయింది
కెరీర్ బిగినింగ్ లో అద్దె కట్టలేక ఇబ్బంది పడ్డ రోజులని మోహన్ బాబు ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సినిమా ఆడిషన్స్ కోసం ఫోటోలు ఇవ్వాల్సి వస్తే ఆ ఫోటోలకు కూడా తన దగ్గర డబ్బులు లేని జీవితాన్ని అనుభవించినట్లు మోహన్ బాబు తెలిపారు. తన తండ్రి టీచర్ కావడం వల్ల క్రమశిక్షణ బాగా అలవాటు అయింది. నా చుట్టూ ఉన్న వారు కూడా క్రమశిక్షణతో ఉండాలని భావిస్తాను.
గరిట తిప్పడం కూడా తెలుసు
ఇదిలా ఉండగా తన ముక్కుసూటి తనం, షార్ట్ టెంపర్ వల్ల చాలా సందర్భాల్లో ఇబ్బందుల్లో పడ్డానని మోహన్ బాబు అన్నారు. అదేవిధంగా వంటల విషయంలో తనకు ఉన్న ఆసక్తిని కూడా మోహన్ బాబు బయట పెట్టారు. చికెన్, మటన్, సాంబార్ లాంటి వంటలు బాగా వండుతానని మోహన్ బాబు అన్నారు.