- Home
- Entertainment
- మాస్ సాంగ్స్, ఫైట్స్ లేని క్లాస్ చిత్రానికి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరో.. ఇండియా మొత్తం షేక్
మాస్ సాంగ్స్, ఫైట్స్ లేని క్లాస్ చిత్రానికి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరో.. ఇండియా మొత్తం షేక్
ఓ తెలుగు హీరో మాస్ సాంగ్స్, ఫైట్స్ లేని క్లాస్ చిత్రానికి ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ సృష్టించారు. ఆ హీరో ఎవరు, ఆ చిత్రం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. Chiranjeevi record remuneration for this class movie

కొన్ని దశాబ్దాల క్రితమే బాలీవుడ్ పై టాలీవుడ్ డామినేషన్
ఇండియన్ సినిమా చరిత్రలో తెలుగు సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు టాలీవుడ్ నుంచే నిర్మించబడుతున్నాయి. అవలీలగా 1000 కోట్ల కలెక్షన్స్ ని తెలుగు సినిమా సాధిస్తోంది. టాలీవుడ్ చేస్తున్న సంచలనాలు చూసి బాలీవుడ్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నివ్వెరపోయే అద్భుతం చేశారు.
ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్
మెగాస్టార్ చిరంజీవి 1992లో ఓ చిత్రానికి ఏకంగా 1 కోటి 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అప్పట్లో అది ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్. అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే అతి పెద్ద హీరో అమితాబ్ బచ్చన్ అని మాత్రమే భావించేవారు. కానీ బిగ్ బిని మించేలా చిరంజీవి రూ. 1.25 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఆ టైంలోనే వివిధ మ్యాగజైన్ సంస్థలు చిరంజీవిని బిగ్గర్ దేన్ బచ్చన్ అని ప్రశంసలు కురిపించాయి.
క్లాస్ చిత్రానికి అంత పారితోషికమా ?
అయితే చిరంజీవి ఇండియాలోనే అత్యధికంగా అంత రెమ్యునరేషన్ అందుకున్న చిత్రం అంటే ఒక రేంజ్ లో యాక్షన్, సాంగ్స్ ఉంటాయని ఊహించుకోవద్దు. చిరు ఆ రెమ్యునరేషన్ అందుకున్నది మాస్ సాంగ్స్, ఫైట్లు లాంటివి ఏమీ లేని ఒక క్లాస్ మూవీ కోసం. ఆ చిత్రం మరేదో కాదు కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపద్బాంధవుడు. ఇది చిరంజీవి తన కెరీర్ లో నటించిన క్లాస్ చిత్రాల్లో ఒకటి.
ఘరానా మొగుడుతో ఇండస్ట్రీ హిట్
ఆపద్బాంధవుడు చిత్రానికి ముందే చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏకంగా 10 కోట్లు రాబట్టింది. తెలుగులో 10 కోట్ల మార్క్ అందుకున్న తొలి చిత్రం అదే. దీనితో చిరంజీవి క్రేజ్ కొత్త శిఖరాలకు చేరింది. అందుకే ఆ తర్వాత చిరంజీవి నటించిన ఆపద్భాందవుడు చిత్రానికి అంత రెమ్యునరేషన్ ఇచ్చారు.
చిరంజీవి సాలిడ్ కంబ్యాక్
ఆపద్భాందవుడు తర్వాత మూడేళ్ళ పాటు చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. ఎస్పీ పరుశురాం, బిగ్ బాస్ లాంటి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత 1997లో చిరంజీవి హిట్లర్ చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.