- Home
- Entertainment
- 2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
2K Kids Heroines: 2000వ సంవత్సరం తర్వాత పుట్టిన వారిని 2K కిడ్స్ అంటుంటారు. ఈ తరం కుర్రాళ్ల మనసులను తమ అందం, నటనతో దోచుకుంటున్న సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

1. శ్రీలీల:
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తోంది. ఈమె ఇప్పుడు ట్రెండింగ్‌లో నంబర్ వన్ అని అంటున్నారు. 2K కిడ్స్ మనసులో ఈమెదే ఫస్ట్ ప్లేస్ అని చెబుతున్నారు. `పెళ్లిసందడి`, `ధమాఖా` చిత్రాలతో అలరించిన శ్రీలీలా ఇప్పుడు సూపర్ స్టార్స్ తో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్`లో నటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటతో శ్రీలీల చాలా పాపులర్ అయింది.
2. కృతి శెట్టి:
కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. సూర్య నటిస్తున్న 'వణంగాన్' సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. 2K కిడ్స్‌కు ఎంతో ఇష్టమైన హీరోయిన్‌గా, యువతలో కొత్త ట్రెండింగ్ లిస్ట్‌లో ఈమె ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కృతికి 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తెలుగులో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, కానీ కుర్రాళ్ల డ్రీమ్ హీరోయిన్ అయ్యింది కృతి.
3. ప్రియాంక అరుళ్ మోహన్:
ప్రియాంక మోహన్ మొదటగా శివకార్తికేయన్ నటించిన 'డాక్టర్' సినిమాతో తమిళంలో పాపులర్ అయింది. ఆమె సహజమైన నటన, అందానికి తమిళనాడులో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ఆమె `గ్యాంగ్ లీడర్`, `సరిపోదా శనివారం`, `ఓజీ` చిత్రాల్లో నటించింది. 2K కిడ్స్‌కు ఇష్టమైన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకను 6 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
4. మమితా బైజు:
మమితా బైజు ఒకే ఒక్క పాటతో మలయాళంతోపాటు తెలుగులో చాలా ఫేమస్ అయింది. ` ప్రేమలు` చిత్రంలో 'పూట్టి వెచ్చ కుదిరై ఒండ్రు పుట్టుకిచ్చు మామా' అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
5.కయాదు లోహర్
రెండేళ్ల క్రితం `డ్రాగన్` మూవీతో పాపులర్ అయ్యింది కయాదు లోహర్. ఓ డాన్స్ లో ఆమె గ్లామర్ షో దుమ్మురేపింది. దీంతో ఆమెని స్టార్‌ని చేసింది. ఈ క్రమంలో వరుసగా ఆఫర్లు అందుకుంటుంది. ఇటీవల తెలుగులో `ఫంకీ` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆడలేదు. కానీ కయాదుకి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి.

