- Home
- Entertainment
- నాగార్జునని కోలుకోలేని దెబ్బ కొట్టిన స్టార్ హీరో, ఆ మూవీపై కొన్ని రోజుల్లోనే రివేంజ్
నాగార్జునని కోలుకోలేని దెబ్బ కొట్టిన స్టార్ హీరో, ఆ మూవీపై కొన్ని రోజుల్లోనే రివేంజ్
నాగార్జున సినిమాపై తాను రివేంజ్ తీర్చుకున్నట్లు స్టార్ హీరో ఒకరు ఓపెన్ గా చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

విలన్ గా నాగార్జున
అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటుడిగా కొత్త పంథా ఎంచుకున్నారు. రజనీకాంత్ కూలీ చిత్రంలో నాగ్ విలన్ గా నటిస్తున్నారు. హీరోగా కొనసాగుతూనే నాగ్ ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉంది. దశాబ్దాలుగా నాగార్జున టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పి అగ్ర హీరోల జాబితాలో చేర్చిన చిత్రం శివ.
KNOW
శివ, అంకుశం మధ్య పోటీ
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ మూవీ టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. నాగార్జున శివ మూవీపై హీరో రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అంకుశం మూవీ ఒకటి. అంకుశం మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న తరుణంలో కొన్ని వారాల తర్వాత నాగార్జున శివ మూవీ విడుదలైంది.
అంకుశం చిత్రాన్ని నామినేట్ చేసిన శివ
దీనితో అంకుశం కలెక్షన్స్ కి గండి పడింది. శివ మూవీ రిలీజ్ కాకుంటే రాజశేఖర్ అంకుశం మూవీ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయి ఉండేది. ఈ విషయాన్ని రాజశేఖర్ ఇంటర్వ్యూలో తెలిపారు. నాగార్జున శివ మూవీ మా అంకుశం చిత్రాన్ని దెబ్బ కొట్టింది. మేము కూడా తిరిగి నాగార్జున చిత్రాన్ని దెబ్బ కొట్టి రివేంజ్ తీర్చుకున్నట్లు రాజశేఖర్ నవ్వుతూ చెప్పారు.
కోలుకోలేని దెబ్బ కొట్టి రివేంజ్ తీర్చుకున్న రాజశేఖర్
ఒక వేళ నాగార్జున గారు ఏమి అనుకోకుంటే ఈ విషయం చెబుతాను. శివ చిత్రాన్ని ఉదయం పేరుతో తమిళ్ కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేశారు. మేము కూడా అదే సమయంలో అంకుశం చిత్రాన్ని తమిళ్ లో 'ఇదు తండా పోలీస్' పేరుతో రిలీజ్ చేశాం. కానీ నాగార్జున శివ మూవీ తమిళ్ లో కనిపించకుండా పోయింది. మా చిత్రం మాత్రం సూపర్ హిట్ అయింది అని రాజశేఖర్ తెలిపారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అంకుశం
అంకుశం చిత్రాన్ని తమిళ్ లో తానే రిలీజ్ చేశానని మంచి లాభాలు వచ్చాయని రాజశేఖర్ తెలిపారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జీవిత హీరోయిన్ గా నటించారు. విలన్ పాత్రలో రామిరెడ్డి అదరగొట్టారు.