- Home
- Sports
- Cricket
- Vaibhav Suryavanshi: ఫాస్టెస్ట్ సెంచరీ.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు
Vaibhav Suryavanshi: ఫాస్టెస్ట్ సెంచరీ.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు
Vaibhav Suryavanshi: 14 ఏళ్ల భారత యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. అండర్-19 వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
U-19 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్‌లో మరో సంచలనం.. అతని వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే.. కానీ, బ్యాట్ పడితే రికార్డులు బద్దలు కావాల్సిందే. అతనే వైభవ్ సూర్యవంశీ. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడాడు.
ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శనతో U-19 వన్డే చరిత్రను తిరగరాశాడు. ఇంగ్లాండ్ U-19 జట్టుతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, నాల్గో వన్డేలో వైభవ్ తన సెంచరీని కేవలం 52 బంతుల్లో పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
వైభవ్ సూర్యవంశీ ఈ సెంచరీ రికార్డులు
• అండర్ 19 క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన యంగ్ ప్లేయర్
• భారత అండర్ 19 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతి చిన్న వయస్సు ఆటగాడు
• ప్రపంచ అండర్ 19 వన్డే చరిత్రలో అతి చిన్న వయస్సులో సెంచరీ సాధించిన ఆటగాడు
సర్ఫరాజ్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
ఇంతకుముందు ఈ ఘనత భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరిట ఉండేది. ఆయన 2013లో దక్షిణాఫ్రికా U-19 జట్టుపై 15 ఏళ్ల 338 రోజుల్లో సెంచరీ సాధించాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 241 రోజుల్లోనే సెంచరీ చేసి ఆ రికార్డును చెరిపేసాడు.
అలాగే, బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ షాంటో 2013లో 14 ఏళ్లు 241 రోజుల్లో సెంచరీ కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు వైభవ్ సూర్య వంశీ ఆ రికార్డును కూడా అధిగమించాడు.
ఒకే ఒక్క బంతిలో రికార్డు బ్రేక్
52 బంతుల్లో సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్ ఘులామ్ 53 బంతుల సెంచరీని (2013లో ఇంగ్లాండ్ U-19పై) రికార్డును అధిగమించాడు. భారత్ తరఫున ఈ రికార్డు గతంలో రాజ్ అంగద్ బావా పేరిట (69 బంతుల్లో - 2022లో ఉగాండాపై) ఉండేది.
వైభవ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 78 బంతులు ఆడి 143 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్ లోనూ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన
ఐపీఎల్ 2025 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించాడు. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఐపీఎల్ సెంచరీ సాధించాడు. అలాగే, ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ సెంచరీ గా నిలిచింది.
ఇంగ్లాండ్ సిరీస్‌లో సూపర్ ఫామ్ లో వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లాండ్ U-19తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. సూపర్ ఇన్నింగ్స్ లను ఆడాడు.
• మొదటి వన్డేలో 48 పరుగులు
• రెండో వన్డేలో 45 పరుగులు
• మూడవ వన్డేలో 86 (31 బంతుల్లో)
• నాల్గవ వన్డేలో 143 (78 బంతుల్లో)
మూడవ వన్డేలో వాయభవ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత యువ క్రికెట్ చరిత్రలో రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇది.