IND vs ENG: డిక్లేర్ చేయి గురూ.. శుభ్‌మన్ గిల్ తో హ్యారీ బ్రూక్.. వైరల్ వీడియో
Shubman Gill shuts down Harry Brook: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ ముందు భారత్ 608 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. అయితే, మ్యాచ్ సందర్భంగా గిల్, హ్యారీ బ్రుక్ డిక్లేర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ జోరు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల వర్షా కురిపించాడు. ఇంగ్లాండ్‌పై భారత్ భారీ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీల మోత మోగించాడు. ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన అరుదైన ఆటగాళ్ల సరసన గిల్ చేరాడు. ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ సంభాషణ వైరల్ గా మారింది.
తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన గిల్
భారత్, మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆ తర్వాత భారత్, ఇంగ్లాండ్‌ను 407 పరుగులకు ఆలౌట్ చేసి 180 పరుగుల లీడ్‌ను సాధించింది.
నాల్గో రోజు ఆటలో భారత్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించగా, గిల్ దూకుడు కొనసాగింది. 162 బంతుల్లో 161 పరుగుల సెంచరీ సాధించాడు. తన నాక్ తో ఇంగ్లాండ్‌పై ఒత్తిడిని మరింత పెంచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 13 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
A special cricketer joins a special list! 🫡
Well done, Captain Shubman Gill! 👏 👏
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/rSuVgLLdet— BCCI (@BCCI) July 5, 2025
గిల్ తో హ్యారీ బ్రూక్ సరదా వ్యాఖ్యలు.. స్టంప్ మైక్‌లో రికార్డ్
ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్, గిల్ బ్యాటింగ్ చేస్తుండగా సరదాగా అతన్ని డిక్లేర్ చేయండి అంటూ కామెంట్స్ చేశాడు. “450 డిక్లేర్ కాదా? రేపు వర్షం పడుతుంది. మధ్యాహ్నం అరగంటపాటే ఆట” అన్నాడు.
దీనికి గిల్ “మా బ్యాడ్ లక్” అని సమాధానమిచ్చాడు. దీంతో బ్రూక్ “డ్రా తీసుకో” అంటూ చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Fancy a declaration, skipper? 😏 #HarryBrook's playful banter with #ShubmanGill had everyone in splits —
Trying to charm the Indian captain into a cheeky call? 😂#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/xTJJYhAGRk— Star Sports (@StarSportsIndia) July 5, 2025
ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల టార్గెట్ ఉంచిన భారత్
చివరికి భారత్ 427/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో అరుదైన స్కోర్లలో ఒకటి. రెండవ ఇన్నింగ్స్‌లో గిల్ 161 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్ట్‌లో మొత్తం 430 పరుగులు సాధించి, ఒకే టెస్ట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా గిల్ గుర్తింపు పొందాడు.
గిల్ కు తోడుగా జడేజా, పంత్, రాహుల్ జోరు
రెండో ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీలతో రాణించారు. పంత్ 65 పరుగులు, రాహుల్ 55 పరుగులు, జడేజా అజేయంగా 69 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున జోష్ టంగ్, షోయబ్ బషీర్ తలో రెండు వికెట్లు తీశారు.
గిల్ అరుదైన రికార్డులు సాధించాడు. గిల్ ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) చేసిన తొమ్మిదవ ప్లేయర్ గా నిలిచాడు. భారత్ తరపున ఇదివరకు ఈ ఘనతను సునీల్ గవాస్కర్ మాత్రమే సాధించాడు (1971, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో).
టెస్ట్ కెప్టెన్‌గా తొలి రెండు టెస్టుల్లో మూడు సెంచరీలు చేసిన రెండవ భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తరువాత గిల్ నిలిచాడు.
టెస్ట్ కెప్టెన్సీ ప్రారంభ దశలో రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన అరుదైన ఆటగాళ్లలో గిల్ కూడా చేరాడు. ఇందులో విజయ్ హజారే, గవాస్కర్, గ్రెగ్ చాపెల్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.