Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన గిల్
Shubman Gill: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్ ప్రతిభను మరోసారి చూపించాడు. అద్భుతమైన ఆటతో మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు డబుల్ సెంచరీ కొట్టాడు.
ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ ను దంచికొడుతూ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (161 పరుగులు) సాధించాడు. దీంతో పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత టెస్ట్ కెప్టెన్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు.
విరాట్ కోహ్లిని అధిగమించిన గిల్
శుభ్ మన్ గిల్ ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 585 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన 449 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు.
తొలి సిరీస్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
- 459 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్ (2025, విదేశాల్లో 4 ఇన్నింగ్స్‌లు)
- 449 - విరాట్ కోహ్లి vs ఆస్ట్రేలియా (2014/15, విదేశాల్లో, 4 ఇన్నింగ్స్‌లు)
- 347 - విజయ్ హజారే vs ఇంగ్లాండ్ (1951/52, ఇండియాలో, 7 ఇన్నింగ్స్‌లు)
- 319 - నరి కాంట్రాక్టర్ vs పాకిస్తాన్ (1960/61, ఇండియాలో, 6 ఇన్నింగ్స్‌లు)
- 305 - దిలీప్ వేంగ్ సర్కార్ vs వెస్టిండీస్ (1987/88, ఇండియాలో, 5 ఇన్నింగ్స్‌లు)
- 303 - మొహమ్మద్ అజారుద్దీన్ vs న్యూజిలాండ్ (1989/90, విదేశాల్లో, 4 ఇన్నింగ్స్‌లు)
ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన రెండో భారతీయుడు గిల్
శుభ్‌మన్ గిల్, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 269 పరుగులు (1st ఇన్నింగ్స్), 161 పరుగులు (2nd ఇన్నింగ్స్) తో రాణించి, ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. గిల్ కంటే ముందు ఈ రికార్డును లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సాధించాడు. 1971లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో 124, 220 పరుగులు చేశారు.
ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన ఆటగాళ్లు వీరే
- డగ్ వాల్టర్స్ (ఆస్ట్రేలియా) - 242 & 103 vs వెస్టిండీస్
- సునీల్ గవాస్కర్ (భారత్) - 124 & 220 vs వెస్టిండీస్
- లారెన్స్ రో (వెస్టిండీస్) - 214 & 100* vs న్యూజిలాండ్
- గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా) - 247* & 133 vs న్యూజిలాండ్
- గ్రహాం గూచ్ (ఇంగ్లాండ్) - 333 & 123 vs ఇండియా
- బ్రియాన్ లారా (వెస్టిండీస్) - 221 & 130 vs శ్రీలంక
- కుమార సంగక్కార (శ్రీలంక) - 319 & 105* vs బంగ్లాదేశ్
- మార్నస్ లాబుషేన్ (ఆస్ట్రేలియా) - 204 & 104* vs వెస్టిండీస్
- శుభ్‌మన్ గిల్ (భారత్) - 269 & 161 vs ఇంగ్లాండ్
ఒక టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినబ్యాటర్లు
1. 456 పరుగులు - గ్రాహమ్ గూచ్ (ఇంగ్లాండ్) vs ఇండియా, లార్డ్స్, 1990
2. 430 పరుగులు - శుభ్‌మన్ గిల్ (భారత్) vs ఇంగ్లాండ్, ఎడ్జ్‌బాస్టన్, 2025
3. 426 పరుగులు - మార్క్ టేలర్ (ఆస్ట్రేలియా) vs పాకిస్థాన్, పెషావర్, 1998
4. 424 పరుగులు - కుమార సంగక్కర (శ్రీలంక) vs బాంగ్లాదేశ్, చట్గ్రామ్, 2014
5. 400 పరుగులు - బ్రియాన్ లారా (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, సెయింట్ జాన్స్ 2004
అలాగే, ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ గా మూడో స్థానంలో గిల్ నిలిచాడు.
- రోహిత్ శర్మ - 13 సిక్సర్లు vs దక్షిణాఫ్రికా, విశాఖపట్నం, 2019
- యశస్వి జైస్వాల్ - 12 సిక్సర్లు vs ఇంగ్లాండ్, రాజకోట్, 2024
- శుభ్‌మన్ గిల్ - 11 సిక్సర్లు vs ఇంగ్లాండ్, ఎడ్జ్‌బాస్టన్, 2025