- Home
- Sports
- Cricket
- Tilak Varma: ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు కెప్టెన్సీ.. ఇక దబిడి దిబిడే
Tilak Varma: ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు కెప్టెన్సీ.. ఇక దబిడి దిబిడే
Tilak Varma: తిలక్ వర్మ దులీప్ ట్రోఫీ 2025లో దక్షిణ జోన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రంజీ, కౌంటీల్లో మంచి ప్రదర్శనలతో తిలక్ కు ఈ బాధ్యతలు అప్పగించారు.

దులీప్ ట్రోఫీ 2025లో సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ
భారత యంగ్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మకు దులీప్ ట్రోఫీ 2025లో దక్షిణ జోన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అవకాశం లభించింది. ఇటీవల హాంప్‌షైర్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అసాధారణ ప్రదర్శన చేసిన తిలక్, నాలుగు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు సహా మొత్తం 315 పరుగులు చేశాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీ, తర్వాత 56 పరుగులు, 47 పరుగుల ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక నాట్స్‌పై మూడో గేమ్‌లో 112 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
KNOW
తిలక్ వర్మ కెప్టెన్సీలో బలమైన జట్టు
దక్షిణ జోన్ జట్టులో తిలక్ వర్మతోపాటు బలమైన ప్లేయర్లు ఉన్నారు. నారాయణ జగదీషన్, దేవదత్ పడిక్కల్, ఆర్ సాయి కిషోర్, విజయ్‌కుమార్ వైషాక్ లాంటి ప్రతిభావంతులు ఉన్నారు.
జట్టు వైస్ కెప్టెన్‌గా రంజీ సెమీఫైనల్లో గుజరాత్‌పై 177 పరుగులు చేసిన కేరళ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ నియమితులయ్యారు.
ఐపీఎల్ స్టార్లు, టెస్టు స్క్వాడ్ సభ్యులు కూడా ఉన్నారు
దేవదత్ పడిక్కల్ ఇప్పటికే భారత్ తరఫున టెస్టులు, టీ20లు ఆడిన అనుభవం ఉన్నవాడు. మరోవైపు, నారాయణ జగదీషన్ ఇటీవల ఇంగ్లాండ్‌తో అయిదవ టెస్టుకు పిలుపు పొందాడు. అయితే అతను ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు.
ఆసియా కప్ 2025 లో ఆడనున్న తిలక్ వర్మ
తిలక్ వర్మ ప్రస్తుతం టీ20 జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. 2025 సెప్టెంబర్ 8న ప్రారంభమయ్యే ఆసియా కప్‌కు అతను ఎంపికైతే, దులీప్ ట్రోఫీ మొత్తాన్ని ఆడే అవకాశం ఉండదు.
అతను ఇప్పటివరకు భారత్ తరఫున 25 టీ20లు, 4 వన్డేలు ఆడాడు. ఈ సారి ఆసియా కప్ 2025ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు.
దులీప్ ట్రోపీ 2025 టోర్నమెంట్ లో 6 జట్లు
దులీప్ ట్రోఫీ ఈసారి తన గత ఫార్మాట్‌కు తిరిగివచ్చింది. మొత్తం ఆరు జట్లు ఈ ప్రీమియర్ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. దక్షిణ, పశ్చిమ జోన్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత పొందగా, నార్త్ వర్సెస్ ఈస్ట్, సెంట్రల్ వర్సెస్ నార్త్ ఈస్ట్ మధ్య క్వార్టర్‌ఫైనల్స్ ఆగస్ట్ 28 నుంచి 31 వరకు జరుగనున్నాయి. సెమీఫైనల్స్ సెప్టెంబర్ 4 నుంచి 7, ఫైనల్ సెప్టెంబర్ 11 నుంచి 15 మధ్య బీసీసీఐ సీఈఓ గ్రౌండ్స్‌లో జరుగుతుంది.
దులీప్ ట్రోఫీ 2025: దక్షిణ జోన్ స్క్వాడ్
తిలక్ వర్మ (కెప్టెన్, హైదరాబాద్), మహ్మద్ అజహరుద్దీన్ (వైస్ కెప్టెన్, కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పుదుచ్చేరి), సల్మాన్ నిజార్ (కేరళ), నారాయణ జగదీషన్ (తమిళనాడు), త్రిపురాన విజయ్ (ఆంధ్రప్రదేశ్), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎమ్.డి. (కేరళ), రికీ భుయ్ (ఆంధ్రప్రదేశ్), బాసిల్ ఎన్‌పీ (కేరళ), గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతంకర్ (గోవా)
స్టాండ్‌బై ఆటగాళ్లు:
మోహిత్ రెడ్‌కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అన్కిత్ శర్మ (పుదుచ్చేరి), ఎడెన్ ఆపిల్ టామ్ (కేరళ), ఆండ్రే సిద్ధార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్రప్రదేశ్)