MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • T20 World Cup 2026 సెమీ ఫైనల్: మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?

T20 World Cup 2026 సెమీ ఫైనల్: మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?

T20 WC Semifinal : టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏ జట్టు ఫైనల్‌కు వెళ్తుంది? మరి ఇండియా పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 03 2026, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌతాఫ్రికా vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్
Image Credit : X/ICC

సౌతాఫ్రికా vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్

టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠ భరితమైన ముగింపు దశకు చేరుకుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం జరగనున్న మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. అయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌తో పోలిస్తే, ఈ మ్యాచ్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వరుస విజయాలతో దక్షిణాఫ్రికా జోరు
Image Credit : Getty

వరుస విజయాలతో దక్షిణాఫ్రికా జోరు

దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. గ్రూప్ దశలో ఆధిపత్యం ప్రదర్శించిన ప్రోటీస్, సూపర్-8 దశలోనూ అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా సూపర్-8లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ను 76 పరుగుల తేడాతో ఓడించి తమ సత్తా చాటింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, జింబాబ్వేపై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా ఈసారి టైటిల్ గెలిచే బలమైన జట్టుగా కనిపిస్తోంది.

36
న్యూజిలాండ్ పోరాటం.. ఒడిదుడుకులు
Image Credit : Getty

న్యూజిలాండ్ పోరాటం.. ఒడిదుడుకులు

మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం కాస్త హెచ్చుతగ్గులతో సాగింది. గ్రూప్ దశలో మూడు విజయాలు, ఒక ఓటమితో సెమీస్‌కు చేరింది. ఆ ఒక్క ఓటమి కూడా దక్షిణాఫ్రికా చేతిలోనే రావడం గమనార్హం. సూపర్-8లో శ్రీలంకపై 61 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తృటిలో ఓడిపోయింది. పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఒక పాయింట్‌ను పంచుకుంది. అయినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంతో మిచెల్ సాంట్నర్ సేన సెమీస్‌కు అర్హత సాధించింది.

46
సెమీ ఫైనల్ మ్యాచ్ : వర్షం కురిస్తే ఐసీసీ నిబంధనలు ఇవే
Image Credit : Getty

సెమీ ఫైనల్ మ్యాచ్ : వర్షం కురిస్తే ఐసీసీ నిబంధనలు ఇవే

సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. సూపర్-8 దశలో రిజర్వ్ డే లేకపోయినా, సెమీస్‌కు మాత్రం అదనపు సమయం, రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ మ్యాచ్ జరిగే రోజు వర్షం అంతరాయం కలిగిస్తే, మ్యాచ్ పూర్తి చేయడానికి అదనంగా 90 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నిర్ణీత రోజున మ్యాచ్ సాధ్యం కాకపోతే, తర్వాతి రోజైన రిజర్వ్ డే నాడు మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగిస్తారు.

56
రిజర్వ్ డే కూడా రద్దయితే ఫలితం ఎలా?
Image Credit : Getty

రిజర్వ్ డే కూడా రద్దయితే ఫలితం ఎలా?

ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే, విజేతను నిర్ణయించడానికి బౌల్-అవుట్ లేదా టాస్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో సూపర్-8 దశలో జట్ల ర్యాంకింగ్ ఆధారంగా ఫైనలిస్ట్‌ను నిర్ణయిస్తారు. సూపర్-8 గ్రూప్-1లో దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ గ్రూప్-2లో కేవలం 3 పాయింట్లతో సెమీస్‌కు వచ్చింది. కాబట్టి, వర్షం కారణంగా సెమీ ఫైనల్ పూర్తిగా రద్దయితే, సూపర్-8 పాయింట్ల పట్టికలో పైస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

66
SA vs NZ హెడ్ టు హెడ్ రికార్డులు.. దక్షిణాఫ్రికాదే పైచేయి
Image Credit : Getty

SA vs NZ హెడ్ టు హెడ్ రికార్డులు.. దక్షిణాఫ్రికాదే పైచేయి

టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా, ఐదు సార్లూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది.

• 2007: క్వార్టర్ ఫైనల్లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలిచింది.

• 2009: ఉత్కంఠ పోరులో కేవలం ఒక పరుగు తేడాతో సఫారీలు విజయం సాధించారు.

• 2010: బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులతో సౌతాఫ్రికా గెలిచింది.

• 2014: న్యూజిలాండ్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో దక్షిణాఫ్రికా ఓడించింది.

• 2026 (ప్రస్తుత టోర్నీ): అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో మార్క్రామ్ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ గణాంకాలను చూస్తే సెమీస్‌లో దక్షిణాఫ్రికాకే విజయవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నాకౌట్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేము.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
Sanju Samson: టీమిండియాకు బిగ్ షాక్.. సంజూ శాంసన్ పై బ్యాన్? ‎
Recommended image2
IND vs ENG : సెమీఫైనల్‌లో భారత్‌కు సూర్యగ్రహణం? ఫామ్ లేక కెప్టెన్ ఇబ్బందులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved