- Home
- Sports
- Cricket
- Kohli Rohit: ఆసియా కప్ 2025 నుంచి అవుట్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బిగ్ షాక్
Kohli Rohit: ఆసియా కప్ 2025 నుంచి అవుట్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బిగ్ షాక్
Virat Kohli and Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2025 ఆసియా కప్ కు దూరం అయ్యారు. వీరు ఆసియా కప్ 2025ని ఆడలేరు. టీమిండియా ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్, రోహిత్ ఎందుకు ఆసియా కప్ 2025 ఆడడంలేదు?
రాబోయే ఆసియా కప్ 2025 లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటను చూడాలనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనరని అధికారికంగా వెల్లడించారు.
ఎందుకంటే ఈ ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుండటమే. 2024లో టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
KNOW
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్
2024 జూన్ 29న బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన వెంటనే భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ తమ టీ20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వరకు టెస్టులు ఆడిన వీరు 2025 మేలో టెస్టులకు కూడా గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పటికీ వీరు వన్డే ఫార్మాట్‌లో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు.
2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ కెప్టెన్సీ
రోహిత్ శర్మ ఇప్పటికీ భారత జట్టు వన్డే కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అలాగే, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ 2027 వరల్డ్ కప్‌లో టీమిండియాకు నాయకత్వం వహించనున్నారు. కోహ్లీ కూడా జట్టులో భాగంగా ఉంటారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఆసియా కప్ 2025 నుంచి రవీంద్ర జడేజా కూడా అవుట్
ఆసియా కప్ 2025 నుంచి భారత సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తో పాటు మరో కీలక ఆటగాడు రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్‌కు దూరం కానున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన మరుసటి రోజే జడేజా కూడా టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు.
ఆసియా కప్ 2025 లో ఇండియా vs పాక్ మధ్య బిగ్ ఫైట్
2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరిగే ఈ కంటినెంటల్ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. ఇండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈపై ఆడుతుంది. ఇక ఫ్యాన్స్‌కు మళ్లీ సూపర్ విందుగా, సెప్టెంబర్ 14న పాక్‌తో హై వోల్టేజ్ క్లాష్ ఉంది. సూపర్ ఫోర్, ఫైనల్ దాకా ఈ రెండు జట్లు మరో రెండు సార్లు పోటీ పడే ఛాన్స్ ఉంది.