MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. కీలక ఆటగాడికి గాయం.. సీజన్ కు డౌటే..?

IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. కీలక ఆటగాడికి గాయం.. సీజన్ కు డౌటే..?

TATA IPL 2022: ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచులో సూపర్ విక్టరీని ఎంజాయ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన కీలక ఆల్ రౌండర్  మిచెల్ మార్ష్ కు గాయమైంది.

1 Min read
Author : Srinivas M
Published : Mar 28 2022, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ లో ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో భారీ లక్ష్యాన్ని  ఛేదించి సూపర్ విక్టరీ కొట్టిన  ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన కీలక ఆటగాడు మిచెల్ మార్ష్.. ఈ సీజన్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తున్నది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆస్ట్రేలియాకు చెందిన మార్ష్.. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడబోతున్న జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అయితే ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా  అతడికి గాయమైనట్టు సమాచారం.

36

తొడ కండరాలు పట్టేయడంతో అతడు పాకిస్థాన్ తో మార్చి 29న లాహోర్ వేదికగా జరుగబోయే తొలి వన్డేతో పాటు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండటం అనుమానమే. ఈ విషయాన్ని స్వయంగా ఆసీస్  పరిమిత ఓవర్ల  సారథి ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. 

46

‘మిచ్ మార్ష్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.  అతడు పాక్ తో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండటం కష్టమే.. నిన్న ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అతడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు..’ అని ఫించ్ తెలిపాడు. 

56

కాగా.. ఈ ఆల్ రౌండర్ ను ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. రూ. 6.5 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం  పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్ష్ తో పాటు ఐపీఎల్ లో ఆడబోయే ఆసీస్ ఆటగాళ్లంతా భారత్ లో జరుగుతున్న తమ తమ జట్లతో కలుస్తారు. 

66

అయితే మార్ష్  గాయం పెద్దదైతే మాత్రం అతడు  ఐపీఎల్ లో ఆడతాడా..? లేదా..? అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  ఇప్పటికే ఢిల్లీ జట్టు కీలక  బౌలర్ ఆన్రిచ్ నోర్త్జ్ సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిక ఆల్ రౌండర్ మార్ష్ సేవలు కూడా ఆ జట్టుకు అందుతాయా..? అంటే  సమాధానం కోసం మరికొద్దిరోజులు ఆగాల్సిందే. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved