Rishabh Pant: మాంచెస్టర్ టెస్ట్ మధ్యలోనే గ్రౌండ్ ను వీడిన రిషబ్ పంత్.. ఏమైంది?
Rishabh Pant: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మధ్యలోనే రిషబ్ పంత్ గ్రౌండ్ ను వీడాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. రిషబ్ పంత్ కు ఏమైంది?

మాంచెస్టర్ టెస్ట్‌లో తొలి రోజు భారత్ కు బిగ్ షాక్
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టాపార్డర్ ప్లేయర్లు అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయం కావడంతో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ మ్యాచ్ తొలి రోజు 68వ ఓవర్లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ప్రయత్నించగా బంతి నేరుగా రిషబ్ పంత్ కుడి పాదానికి బలంగా తగిలింది. వెంటనే నేలపై పడిపోయిన పంత్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనిపించాడు.
స్ట్రెచర్‌పై గ్రౌండ్ ను వీడిన రిషబ్ పంత్
ఆ ఘటన తర్వాత ఫిజియోలు మైదానంలోకి వచ్చారు. అయితే, పంత్ తీవ్ర నొప్పితో నడవలేని స్థితిలోకి జారుకున్నారు. దీంతో చిన్న అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై ఫీల్డ్ నుంచి పంత్ ను బయటకు తీసుకువచ్చారు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా క్రీజును వీడాడు. పంత్ స్థానంలో రవీంద్ర జడేజాను బరిలోకి పంపారు.
Rishabh Pant is driven off the field of play after suffering some severe swelling on his right foot and Ravindra Jadeja walks out to the middle... 🩹 pic.twitter.com/vJlu5CABQ8
— Sky Sports Cricket (@SkyCricket) July 23, 2025
పంత్ మళ్లీ కీపింగ్ చేస్తాడా? లేదా?
ఈ గాయం నేపథ్యంలో పంత్ మిగతా మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది ఇప్పటికీ అనిశ్చితిగా ఉంది. అతను వికెట్ కీపింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే, ధ్రువ్ జురేల్‌ను ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా భారత్ వినియోగించవచ్చు. ఇప్పటికే లార్డ్స్ టెస్టులో ఫింగర్ గాయం కారణంగా జురేల్ కీపింగ్ చేశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం చేసింది !
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58 పరుగులు), కేఎల్ రాహుల్ (46 పరుగులు) కలిసి 94 పరుగుల భాగస్వామ్యం అందించారు. జైశ్వాల్ టెస్టు కెరీర్‌లో ఇది 12వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే లియమ్ డాసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
Yashasvi Jaiswal continues his impressive run with the bat ✨
He gets to his 12th Test half-century 👏👏
💯 up for #TeamIndia
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#ENGvIND | @ybj_19pic.twitter.com/zUi3A5KD5c— BCCI (@BCCI) July 23, 2025
శుభ్ మన్ గిల్ విఫలం
ఇంగ్లాండ్‌కు కీలకమైన బ్రేక్ షుబ్‌మన్ గిల్ రూపంలో దొరికింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో 12 పరుగులకే ఎల్బీగా ఔట్ అయ్యాడు. పంత్ గాయానికి ముందు భారత్ స్కోరు 225/3గా ఉంది. ఆ తర్వాత సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ కొట్టి అవుట్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 264/4 (83) పరుగులు చేసింది. క్రీజులో శార్ధుల్ ఠాగూర్ 19, రవీంద్ర జడేజా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టెస్ట్ చరిత్రలో మాంచెస్టర్‌లో మొదట బౌలింగ్ ఎంచుకుని గెలిచిన జట్టు ఒక్కటీ లేదు. ఈ నిర్ణయం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చేలా కనిపించనప్పటికీ, పంత్ గాయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చు.
Stumps on the opening day of the 4th Test in Manchester!
115 runs in the final session as #TeamIndia reach 264/4 at the end of Day 1.
Join us tomorrow for Day 2 Action 🏟️
Scorecard ▶️ https://t.co/L1EVgGu4SI#ENGvINDpic.twitter.com/1KcCixeW7Q— BCCI (@BCCI) July 23, 2025