MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో

Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో

Tilak Varma Meets Ram Charan : టీ20 ప్రపంచకప్ హీరో తిలక్ వర్మ హైదరాబాద్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సెట్స్‌ను సందర్శించి సర్ ప్రైజ్ ఇచ్చారు. మూవీలోని స్పోర్ట్స్ సీక్వెన్స్‌లను చూసి ఫిదా అయిన తిలక్ వర్మకు చరణ్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 18 2026, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రికెట్ అండ్ సినిమా.. చరణ్ పెద్ది సెట్స్‌లో తిలక్ వర్మ ఏం చేస్తున్నారు?
Image Credit : X/PeddiMovieOffl

క్రికెట్ అండ్ సినిమా.. చరణ్ పెద్ది సెట్స్‌లో తిలక్ వర్మ ఏం చేస్తున్నారు?

గ్రౌండ్ లో పరుగుల వరద పారించే క్రికెటర్, వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే గ్లోబల్ స్టార్ ఒకే చోట కనిపిస్తే ఆ సందడే వేరు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి అరుదైన దృశ్యం కనిపించింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది షూటింగ్ సెట్స్‌ను సందర్శించారు. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సెట్స్‌లో తిలక్ వర్మ రాకతో ఒక్కసారిగా సందడి నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హై-వోల్టేజ్ స్పోర్ట్స్ సీక్వెన్స్‌లకు తిలక్ ఫిదా
Image Credit : X/PeddiMovieOffl

హై-వోల్టేజ్ స్పోర్ట్స్ సీక్వెన్స్‌లకు తిలక్ ఫిదా

ఈ పర్యటనలో భాగంగా తిలక్ వర్మ సినిమాలోని కొన్ని కీలకమైన స్పోర్ట్స్ సీక్వెన్స్‌లను వీక్షించారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఆయన ఈ సన్నివేశాల పట్ల ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఆ సన్నివేశాల్లోని ఎమోషనల్ డెప్త్ తిలక్‌ను బాగా ఆకట్టుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. 

సినిమాలోని క్రీడా సన్నివేశాలు ఎంతో సహజంగా, గ్రిప్పింగ్‌గా ఉన్నాయని ఆయన ప్రశంసించడం చూస్తుంటే, బుచ్చిబాబు ఈసారి మరో సెన్సేషన్ సృష్టించబోతున్నారని స్పష్టమవుతోంది. "టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ తిలక్ వర్మ మా సెట్స్‌కు రావడం సంతోషంగా ఉంది. సినిమాలోని స్పోర్ట్స్ సీక్వెన్స్‌లు చూసి ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యారు" అని దర్శకుడు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

36
తిలక్ కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్.. పెద్ది బ్యాట్
Image Credit : Instagram/peddimovie

తిలక్ కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్.. పెద్ది బ్యాట్

సెట్స్‌కు వచ్చిన తిలక్ వర్మకు రామ్ చరణ్ సాదర స్వాగతం పలికారు. ప్రపంచకప్ సాధించినందుకు చిత్ర యూనిట్ తరపున తిలక్ వర్మను చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. తిలక్ అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన పెద్ది థీమ్ బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్, సినిమా అభిమానులు ఈ మూమెంట్‌ను చూసి పండగ చేసుకుంటున్నారు.

T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤‍🔥

He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/adLYeP7DBg

— PEDDI (@PeddiMovieOffl) March 18, 2026

46
వరుస హిట్ సాంగ్స్.. పెద్ది భారీ అంచనాలు
Image Credit : X/PeddiMovieOffl

వరుస హిట్ సాంగ్స్.. పెద్ది భారీ అంచనాలు

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' పాట 200 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుండగా, చరణ్ ఇంట్రో సాంగ్ 'రైయ్ రైయ్ రా రా' యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక షుగర్ ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ పాటలో చరణ్ మాస్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

56
రెజ్లర్ టు క్రికెటర్.. చరణ్ మేకోవర్
Image Credit : Instagram/peddimovie

రెజ్లర్ టు క్రికెటర్.. చరణ్ మేకోవర్

పెద్ది స్టోరీ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రారంభంలో ఇది కేవలం క్రికెట్ నేపథ్య చిత్రమని భావించినా, తాజాగా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో రెజ్లర్ గా కనిపించనున్నారు. ఒక రెజ్లర్ క్రికెట్ మైదానంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది అనే విభిన్నమైన పాయింట్‌తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. అందుకే రామ్ చరణ్ ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో బాడీ మార్పులు చేసుకుని, కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నారు. స్పోర్ట్స్ అండ్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

66
ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్త రామ్ చరణ్ పెద్ది విడుదల
Image Credit : Instagram/peddimovie

ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్త రామ్ చరణ్ పెద్ది విడుదల

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్యాచ్ వర్క్, ఒక ఐటెం సాంగ్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా గుమ్మడికాయ కొట్టేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, వెంకట సతీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
MI : రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్? ఐపీఎల్ 2026 తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై?
Recommended image2
బన్నీ నుంచి మహేష్ బాబు వరకు : హైదరాబాద్‌లో మన స్టార్ హీరోల రెస్టారెంట్లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved