Rishabh Pant: రిషబ్ పంత్ దెబ్బకు ధోని, రిచర్డ్స్ రికార్డులు బద్దలు
Rishabh Pant: గాయం తర్వాత కూడా భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ లార్డ్స్ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లార్డ్స్ లో ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్మురేపిన రిషబ్ పంత్
లార్డ్స్ మైదానంలో భారత వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ చరిత్రను తిరగరాశాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ మూడో రోజు జరిగిన ఆటలో సూపర్ నాక్ తో సంచలన రికార్డులను సృష్టించాడు.
27 ఏళ్ల రిషభ్ పంత్ 112 బంతుల్లో 74 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. గాయపడిన వేలితోనూ, తీవ్రమైన నొప్పిలోనూ పంత్ దూకుడుగా ఆడాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్‌లో రెండు భారీ సెక్సులు కూడా బాదాడు.
ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. కేఎల్ రాహుల్ కు తోడుగా పంత్ మంచి భాగస్వామ్యంతో భారత్ స్కోర్ ను పరుగులు పెట్టించాడు.
రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్
రిషబ్ పంత్ తన టెస్ట్ కెరీర్‌లో ఇంగ్లాండ్‌పై మొత్తం 35 సిక్సులు బాదాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ (34 సిక్సులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫీట్ సాధించడం ద్వారా పంత్ టెస్ట్ చరిత్రలో ఇంగ్లాండ్‌పై అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు.
ఇంగ్లాండ్‌పై టెస్ట్‌లో అత్యధిక సెక్సులు బాదిన టాప్ 5 ప్లేయర్లు
1. రిషభ్ పంత్ 35 సిక్సర్లు
2. వివియన్ రిచర్డ్స్ 34
3. టిమ్ సౌథీ 30
4. యశస్వి జైస్వాల్ 27
5. శుభ్ మన్ గిల్ 26
రోహిత్ శర్మతో సమానంగా నిలిచిన రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 88 సిక్సులను కొట్టాడు. ఇంగ్లాండ్ తో లార్డ్స్ జరిగిన టెస్టులో రెండు సిక్సర్లతో రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.
ఈ ఘనతను పంత్ కేవలం 46 టెస్టుల్లోనే సాధించగా, రోహిత్‌కు 67 టెస్టులు పట్టాయి. అలాగే, రిషబ్ పంత్ మరో మూడు సిక్సర్లు బాదితే భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (90 సిక్సులు) రికార్డు బద్దలవుతుంది.
ఎంఎస్ ధోనిని అధిగమించిన రిషబ్ పంత్
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ ఇప్పటివరకు 416 పరుగులు సాధించాడు. ఇది భారత వికెట్‌కీపర్‌గా టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌లో సాధించిన అత్యధిక పరుగులు. ఈ రికార్డు అంతకుముందు, లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని పేరిట ఉంది. ధోని 2014లో ఇంగ్లాండ్‌లో 349 పరుగులు చేశాడు. ఇప్పుడు పంత్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో 50+ స్కోర్లు
• మొత్తం: 8
• ఇన్నింగ్స్: 22
• అంతకుముందు రికార్డు: ధోని 8 (23 ఇన్నింగ్స్)
ఆఖరి బంతికి అన్‌ఫార్చునేట్ రన్ అవుట్
రిషబ్ పంత్ గేమ్‌ను డామినేట్ చేస్తూ కొనసాగుతున్న సమయంలో, లంచ్‌కు ముందు చివరి బంతికి రన్ అవుట్ అయ్యాడు. బెన్స్ స్టోక్స్ కవర్‌లో నుంచి బంతిని సమయానికి అందుకొని నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్స్ ను నేరుగా కొట్టడంతో రిషబ్ పంత్ 74 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అప్పటికే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ భాగస్వామ్యం సెంచరీ పరుగులు దాటింది.