KL Rahul: కోహ్లీ, సచిన్ సాధించలేని ఘనత కేఎల్ రాహుల్ సొంతం
KL Rahul: లార్డ్స్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ కొట్టాడు. రికార్డుల మోత మోగించాడు. విదేశీ గడ్డపై అతనికి ఇది 9వ సెంచరీ కావడం విశేషం.

లార్డ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ
ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
అయితే కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపించాడు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఔట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కలిసి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌కు కొత్త ఊపునిచ్చారు.
కోహ్లీ, సచిన్ లకు సాధ్యంకాని చోట కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు లార్డ్స్ మైదానంలో ఒక్క టెస్ట్ సెంచరీ కూడా సాధించలేకపోయారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్, 9000కు పైగా పరుగులు చేసిన విరాట్ లాంటి ఆటగాళ్లకు ఇది సాధ్యం కాలేదు.
కానీ, కేఎల్ రాహుల్ మాత్రం రెండోసారి లార్డ్స్‌లో సెంచరీతో దుమ్మురేపాడు. విదేశీ గడ్డపై తన బ్యాట్ పవర్ ఎలా వుంటుందో మరోసారి చూపించాడు.
CENTURY for KL Rahul! 👏👏
His 10th HUNDRED in Test Cricket 💯
And 2nd Ton at Lord's 🏟️👌
Updates ▶️ https://t.co/X4xIDiSUqO#TeamIndia | #ENGvIND | @klrahulpic.twitter.com/vFDNhWsnH5— BCCI (@BCCI) July 12, 2025
లార్డ్స్‌లో రెండో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్
2021లో ఇంగ్లాండ్ టూర్‌లో లార్డ్స్ వేదికగా 129 పరుగులతో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. మరోసారి ఇదే వేదికపై ఇప్పుడు మరో సెంచరీతో దుమ్మురేపాడు. 100 పరుగుల తన ఇన్నింగ్స్ లో 13 బౌండరీలను బాదాడు.
ఇది టెస్ట్ కెరీర్‌లో అతడి 10వ సెంచరీ. అలాగే, ప్రస్తుత సిరీస్ లో రెండో సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా లార్డ్స్ మైదానంలో రెండో సెంచరీ. దీంతో అతను దిలీప్ వేంగ్ సర్కార్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.
దిలీప్ వెంగ్ సర్కార్ రికార్డును గురిపెట్టిన కేఎల్ రాహుల్
దిలీప్ వేంగ్ సర్కార్ 1979 నుంచి 1990 మధ్యలో లార్డ్స్‌లో నాలుగు టెస్టుల్లో మూడుసార్లు సెంచరీ ఇన్నింగ్స్ లను ఆడాడు. ఇప్పుడు రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ చేస్తే ఈ రికార్డును సమం చేయవచ్చు. ఇప్పటికే రెండు సెంచరీలతో ఉన్నాడు.
అంతర్జాతీయంగా కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర
కేఎల్ రాహుల్ లార్డ్స్‌లో రెండు సెంచరీలతో పాటు మొత్తం నాలుగు టెస్ట్ సెంచరీలను ఇంగ్లాండ్‌లో చేశాడు. తన 10 టెస్ట్ సెంచరీలలో 9 విదేశీ గడ్డపైనే వచ్చాయి. దక్షిణాఫ్రికాలో రెండు, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ లలో ఒక్కో సెంచరీ కొట్టాడు.
మొదటి 10 సెంచరీలలో 9 విదేశాల్లో సాధించిన మూడో ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. అంతకుముందు, కేన్ బ్యారింగ్టన్, మొహిందర్ అమరనాథ్ మాత్రమే ఈ రికార్డును సాధించారు.
రిషబ్ పంత్- కేఎల్ రాహుల్ కీలక భాగస్వామ్యం
లార్డ్స్ టెస్ట్‌లో నాలుగో వికెట్‌కు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కలిసి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ఇంగ్లాండ్‌లో వీరి నాలుగు టెస్ట్ భాగస్వామ్యాల్లో మూడో సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.
2024 లీడ్స్ టెస్ట్‌లో 195 పరుగులు, 2018లో ఓవల్‌లో 204 పరుగుల భాగస్వామ్యం చేసిన వీరిద్దరు, ఇప్పుడు మరోసారి జట్టును కష్ట స్థితి నుంచి రక్షించారు. వీరి ఇన్నింగ్స్ లకు తోడుగా జడేజా (72 పరుగులు), కరుణ్ నాయర్ (40 పరుగులు) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులతో ఇంగ్లాండ్ స్కోర్ ను సమం చేసింది.
Innings Break!
The scores are level in the 1st innings as #TeamIndia are all out for 387.
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/X4xIDiSUqO#ENGvINDpic.twitter.com/jwJV2BmtC6— BCCI (@BCCI) July 12, 2025