MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • RCB: ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్

RCB: ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్

RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 31 2026, 11:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోహ్లీ మెరుపులు.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Image Credit : IPL

కోహ్లీ మెరుపులు.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి అభిమానులకు మరపురాని విజయాన్ని అందించింది. దీంతో వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతడు కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది. చివరివరకు క్రీజులో నిలిచిన కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరుదైన జాబితాలో చోటు
Image Credit : RCB MEDIA

19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరుదైన జాబితాలో చోటు

ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పటివరకు సురేశ్ రైనా, డేవిడ్ వార్నర్, వెంకటేష్ అయ్యర్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సరసన నిలిచాడు. ఫైనల్ లో ఒత్తిడిని అధిగమించి ఈ ఘనత సాధించడం కోహ్లీ స్థాయిని మరోసారి చాటిచెప్పింది.

34
వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ కీలక సహకారం
Image Credit : RCB MEDIA

వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ కీలక సహకారం

కోహ్లీకి మరో ఎండ్‌లో వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ చక్కటి మద్ధతు అందించారు. వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు మలిచాడు. అనంతరం టిమ్ డేవిడ్ 24 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కూడా తమ వంతు పరుగులు జోడించడంతో బెంగళూరు లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది.

44
గుజరాత్ పోరాడినా..
Image Credit : X@ipl

గుజరాత్ పోరాడినా..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. 37 బంతుల్లో అజేయ అర్ధశతకం నమోదు చేసి జట్టును 155 పరుగుల వరకు తీసుకెళ్లాడు. అయితే ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలింగ్ విభాగంలో రసిఖ్ సలామ్ మూడు వికెట్లు సాధించగా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసి గుజరాత్‌ను పెద్ద స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఫైనల్‌లో ఆర్‌సీబీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మరోసారి ఐపీఎల్ కప్‌ను ఎగరేసుకుపోయింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
మ‌హిళ‌ల‌కు అల‌ర్ట్‌.. జూన్ 2 త‌ర్వాత ఉచిత బ‌స్సులో ఆధార్ చెల్ల‌దు. మ‌రేం చేయాలంటే.?
Recommended image2
Railway: రైలు ప‌ట్టాల పక్క‌న ఉండే ఈ సిల్వ‌ర్ బాక్స్‌లు ఏంటి.? వాటి ప‌ని ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved