RCB: విరాట్ కోహ్లీ టీమ్ కు బిగ్ షాక్.. ఆర్సీబీ పై ఐపీఎల్ బ్యాన్ తప్పదా?
RCB may face ban in IPL: బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు. దాదాపు 70 మంది వరకు గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్సీబీపై బ్యాన్ అంశంపై బీసీసీఐ సీరియస్‌గా పరిశీలిస్తోందని సమాచారం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మొదటి ఐపీఎల్ టైటిల్ తోనే ఆర్సీబీ ప్రయాణం ముగుస్తుందా?
RCB may face ban in IPL: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. తమ మొదటి ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. ఈ క్రమంలోనే బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ విషాదంగా మారింది.
జూన్ 4న ఎం. చినాస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించిన ఈ విజయోత్సవంలో భారీగా అభిమానులు గుమికూడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది మరణించగా, 75 మందికి పైగా గాయపడ్డారు.
ఆర్సీబీపై తీవ్ర విమర్శలు.. నిషేధం విధించాలంటూ డిమాండ్
ఈ ప్రమాదానికి కారణమైన ఏర్పాట్ల లోపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, సామాజిక మాధ్యమాల్లో పలువురు, ఈ బాధ్యత ఆర్సీబీ ఫ్రాంచైజీదేనంటూ, వారిపై ఐపీఎల్ 2026 సీజన్‌కు నిషేధం విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది ఘాటు వ్యాఖ్యలతో ఆర్సీబీ తీరుపై మండిపడుతున్నారు.
బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా కీలక వ్యాఖ్యలు
బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా మాట్లాడుతూ.. “ఈ ఘటన తీవ్రంగా బాధించింది. ఇది ప్రైవేట్ ఈవెంట్ అయినా, క్రికెట్ పరంగా మనమందరం బాధ్యత వహించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బీసీసీఐ నూతన మార్గదర్శకాలు రూపొందించనుంది” అని అన్నారు. దీంతో ఆర్సీబీ పై తీసుకునే చర్యలేంటి అనే కొత్త చర్చ మొదలైంది.
బీసీసీఐ ఆర్సీబీ పై ఏం నిర్ణయం తీసుకోనుంది?
తొక్కిసలాట సంఘటనపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ఆర్సీబీపై బ్యాన్ ప్రకటించకపోయినా, సంబంధిత నివేదికల ప్రకారం, పరిస్థితులపై బీసీసీఐ తీవ్రంగా ఆలోచన చేస్తోంది. జట్టు నిర్వహణ లోపం నిరూపితమైతే, లీగ్ విశ్వసనీయతను కాపాడేందుకు బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ పై కర్నాటక సర్కారు కఠిన చర్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఆర్సీబీ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోస్లేను అరెస్టు చేశారు. నిఖిల్ బెంగళూరు విమానాశ్రయం వద్ద ముంబయికి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు హెచ్చరించిన పట్టించుకోలేదా?
సోషల్ మీడియాలో ఉచిత టికెట్ల ప్రకటన వల్లే భారీగా జనాలు తరలివచ్చారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పోలీస్ అధికారులు ముందుగానే భద్రతా లోపాలను హెచ్చరించినప్పటికీ, ఆ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ జట్ల విషయంలో పలు మార్పులు తీసుకురానుంది. అలాగే, ఆర్సీబీ పై ఎలాంటి చర్యలు తీసుకోనుందో అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం.