- Home
- Sports
- Cricket
- IND vs ENG: గిల్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్లతో కొత్త ఉత్సాహం.. ఇంగ్లాండ్‌ను టీమిండియా మట్టికరిపిస్తుందా?
IND vs ENG: గిల్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్లతో కొత్త ఉత్సాహం.. ఇంగ్లాండ్‌ను టీమిండియా మట్టికరిపిస్తుందా?
Team India: ఇంగ్లాండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు అక్కడికి చేరుకుంది. శుభ్ మన్ గిల్ భారత టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ జూన్ 20న ప్రారంభమవుతుంది.

ind vs eng: బిగ్ ఫైట్
Team India: 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌కు చేరుకుంది.
ఈ టూర్‌తో టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా కొత్త శకానికి శ్రీకారం చుడుతోంది, ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు టెస్ట్ జట్టులో లేరు. ఇటీవలే ఈ స్టార్స్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
ఉత్సాహంతో ఇంగ్లాండ్ గడ్డపై కాలుమోపిన టీమిండియా
బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా జట్టు హీత్రో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న దృశ్యాలను పంచుకుంది. ఆటగాళ్ల నవ్వులు, సరదా సంభాషణల ఆ వీడియోల్లో కనిపించాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా డైలాగ్, శుభ్ మన్ గిల్ ఎంట్రీలతో కూడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐపీఎల్ లో దుమ్మురేపి భారత జట్టుతో ఇంగ్లాండ్ చేరిన సాయి సుదర్శన్
ఈ వీడియోలో యంగ్ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ కూడా కనిపించాడు. "ఇండియన్ టెస్ట్ జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. UKకి స్వాగతం!" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడుతూ పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు.
ఇంగ్లాండ్ టూర్ లో 5 టెస్టు మ్యాచ్ లు ఆడనున్న భారత్
ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్ జూన్ నుండి ఆగస్టు 2025 మధ్య జరగనుంది. లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), లార్డ్స్, ది ఓవల్ (లండన్), ఓల్డ్ ట్రాఫర్డ్ (మంచెస్టార్) లు ఈ టెస్టు సిరీస్ కు వేదికలుగా ఉన్నాయి.
శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు
శుభ్ మన్ గిల్ తొలిసారి పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఈ సిరీస్‌లో భారత జట్టు యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్ ప్లేయర్లతో కొత్తగా ఉంది. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరుకునీ, ఇంగ్లాండ్ లయన్స్‌తో వార్మాప్ మ్యాచ్ లు ఆడుతున్నారు.
ఇంగ్లాండ్ సిరీస్ కు భారత జట్టు
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరణ్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
భారత్ తో టెస్టు సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఒలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.