MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • Priya Saroj : రింకూ సింగ్ కు కాబోయే భార్య.. ఎవరీ ప్రియా సరోజ్, ఎంత తోపో తెలుసా..?

Priya Saroj : రింకూ సింగ్ కు కాబోయే భార్య.. ఎవరీ ప్రియా సరోజ్, ఎంత తోపో తెలుసా..?

భారత క్రికెటర్ రింకూ సింగ్‌ ను పెళ్లి చేసుకోబోతున్న ప్రియా సరోజ్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎంత తోపో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 26 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎవరీ ప్రియా సరోజ్?
Image Credit : instagram

ఎవరీ ప్రియా సరోజ్?

ప్రియా సరోజ్... ఈ పేరు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. చిన్న వయసులోనే ఎంపీగా బలమైన రాజకీయ నేపథ్యం, న్యాయశాస్త్రంపై పట్టు ఆమెను అందరి దృష్టిలో పడేలా చేశాయి. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో పుట్టి, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, ఇప్పుడు క్రికెటర్ రింకూ సింగ్‌తో పెళ్లి వరకు ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రియా సరోజ్ బాల్యం, విద్యాభ్యాసం
Image Credit : Instagram

ప్రియా సరోజ్ బాల్యం, విద్యాభ్యాసం

ప్రియా సరోజ్ నవంబర్ 23, 1998న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టారు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన ప్రియా, ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు.

Related Articles

Related image1
T20 World Cup 2026 : రింకూ సింగ్ ఔట్.. జట్టులోకి హైదరబాదీ ప్లేయర్..?
Related image2
Rinku Singh Net Worth : సిలిండర్లు మోసిన కుర్రాడు నేడు స్టార్ క్రికెటర్.. రింకూ ఆస్తి ఎంతుంటుందో తెలుసా?
36
రాజకీయ ప్రస్థానం... మచిలీషహర్‌లో ఘన విజయం
Image Credit : X

రాజకీయ ప్రస్థానం... మచిలీషహర్‌లో ఘన విజయం

2024 సాధారణ ఎన్నికల్లో ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున మచిలీషహర్ (SC) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బీ. పి. సరోజ్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. ఈ విజయంతో ఆమె లోక్‌సభలో అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా రికార్డు సృష్టించారు. లాయర్ వృత్తి నుంచి జాతీయ రాజకీయాల్లోకి ఆమె ప్రవేశం అందరినీ ఆకర్షించింది.
46
పొలిటికల్ క్లారిటీ...
Image Credit : X

పొలిటికల్ క్లారిటీ...

తొలిసారి ఎంపీగా గెలిచిన ప్రియా, తన నియోజకవర్గంలో యువతకు ఉపాధి, మహిళా సాధికారత, స్థానిక అభివృద్ధిపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. ఇలా ఆమెకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానం, వాగ్ధాటి పొలిటికల్ గా ప్లస్ పాయింట్స్ అని విశ్లేషకులు అంటున్నారు. తండ్రి ద్వారా వచ్చిన రాజకీయ పలుకుబడి కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది.

56
వ్యక్తిగత జీవితం: క్రికెటర్‌తో నిశ్చితార్థం
Image Credit : Twitter

వ్యక్తిగత జీవితం: క్రికెటర్‌తో నిశ్చితార్థం

జూన్ 2025లో భారత క్రికెటర్ రింకూ సింగ్‌తో ప్రియా నిశ్చితార్థం జరగడంతో ఆమె వ్యక్తిగత జీవితం వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీంతో క్రీడలు, రాజకీయాల కలయికగా ఈ ఈవెంట్ వైరల్ అయింది. అయితే, రాజకీయ పక్షపాతం వస్తుందనే అనుమానంతో ఉత్తరప్రదేశ్‌లో ఓటర్-అవేర్‌నెస్ ఐకాన్‌గా ఉన్న రింకూను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం కోరింది.
66
ప్రియా సరోజ్ ఎందుకంత ప్రత్యేకం?
Image Credit : X

ప్రియా సరోజ్ ఎందుకంత ప్రత్యేకం?

భారత రాజకీయాల్లో వస్తున్న కొత్త ట్రెండ్‌కు ప్రియా ఒక ఉదాహరణ. ఉన్నత చదువు, వృత్తిపరమైన అనుభవం (లాయర్‌గా), కుటుంబ రాజకీయ నేపథ్యం... ఇవన్నీ ఆమెలో ఉన్నాయి. ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు పెరుగుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
రాజకీయాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : రింకూ సింగ్ ఔట్.. జట్టులోకి హైదరబాదీ ప్లేయర్..?
Recommended image2
Rinku Singh Net Worth : సిలిండర్లు మోసిన కుర్రాడు నేడు స్టార్ క్రికెటర్.. రింకూ ఆస్తి ఎంతుంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved