MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • IND vs ZIM : చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్... వర్షం ముప్పు పొంచివుందా..?

IND vs ZIM : చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్... వర్షం ముప్పు పొంచివుందా..?

Chennai Weather Forecast : ఇవాళ రాత్రి 7 గంటల నుండి తమిళనాడు రాజధాని చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చే ఆ మ్యాచ్ టీమిండియా చాలా కీలకం. ఇలాంటి మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 26 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చెన్నైలో ఇవాళ వర్షం కురుస్తుందా..?
Image Credit : ChatGPT

చెన్నైలో ఇవాళ వర్షం కురుస్తుందా..?

T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్దమయ్యింది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే సూపర్-8 లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారత్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాలి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. అయితే కొద్దిరోజులుగా తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి... ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కు వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నేడు చెన్నై వాతావరణం ఎలా ఉంటుందంటే...
Image Credit : Getty

నేడు చెన్నై వాతావరణం ఎలా ఉంటుందంటే...

చెన్నైలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు కురిసింది... కానీ సమయం గడిచిన కొద్దీ మంచు తగ్గి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ మేఘాలు వర్షాలను కురిపించే అవకాశాలు లేవని... కేవలం వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. సాయంత్రం, రాత్రివేళల్లో కూడా చెన్నైలో మేఘాలతో కూడిన ఆహ్లాదకర వాతావరణమే ఉంటుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నై వాతావరణ కేంద్రం అంచనాలను బట్టి ఇండియా-జింబాబ్వే మ్యాచ్ లో వర్షం ముప్పు లేదని అర్థమవుతోంది. అయితే మేఘాల కారణంగా వెలుతురు సమస్య ఉండవచ్చు... అయితే రాత్రి ప్లడ్ లైట్ల వెలుగులోనే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ సమస్య ఉండదు. మొత్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇండియా, జింబాబ్వే మ్యాచ్ జరుగుతుందని వాతావరణ శాఖ సూచనలను బట్టి తెలుసోంది.

Related Articles

Related image1
IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్
Related image2
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
34
చెన్నై పిచ్ అంచనాలు...
Image Credit : Getty

చెన్నై పిచ్ అంచనాలు...

చెన్నైలోని చెపాక్ స్టేడియం సాధారణంగా స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో పొగమంచు కురిస్తే మాత్రం స్పిన్నర్లకు బంతిపై పట్టు ఉండదు... దీంతో పరిస్థితులు మారే అవకాశాలుంటాయి. ముఖ్యంగా మంచు ఎఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే స్పిన్నర్లపై ఎక్కువగా ఉంటుంది... వారికి ఇబ్బంది తప్పదు.

చెన్నై స్టేడియం టీమిండియా టాప్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి హోం గ్రౌండ్. ఇక్కడ ఏ పరిస్థితుల్లో పిచ్ ఎలా మారుతుందో అతడికి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి భారత స్పిన్నర్లకు అతడి సలహాలు సూచనలు ఎంతగానో పనిచేస్తాయి. వరుణ్ తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జింబాబ్వేతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు.

ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద ఊరట. గత మ్యాచ్‌లో ఇతర బౌలర్లు విఫలమైనా బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అర్షదీప్ సింగ్ కూడా మెరుగైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇలా బలమైన స్పిన్, ఫేస్ బౌలింగ్ అటాక్ తో జింబాబ్వేను చిత్తు చేయడానికి టీమిండియా సిద్దమయ్యింది.

44
టీమిండియా, జింబాబ్వేలకు డూ ఆర్ డై మ్యాచ్...
Image Credit : ANI

టీమిండియా, జింబాబ్వేలకు డూ ఆర్ డై మ్యాచ్...

సూపర్-8 లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ఓడిన టీమిండియా, జింబాబ్వేలకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అందుకే ఇరుజట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతాయి. భారత్ తో పోలిస్తే జింబాబ్వే బలహీనమైన జట్టే... కానీ తనదైన రోజు అద్భుతాలు చేయగలదు. ఆస్ట్రేలియాను ఓడించిమరీ సూపర్ 8 కు చేరిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం. అందుకే టీమిండియా పూర్తి బలంతో, పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్
Recommended image2
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved