MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • On This Day: ఈ రోజుతో ‘ముల్తాన్ కా సుల్తాన్’కు ప్రత్యేక అనుబంధం.. యాదృచ్ఛికమంటే ఇదేనేమో..

On This Day: ఈ రోజుతో ‘ముల్తాన్ కా సుల్తాన్’కు ప్రత్యేక అనుబంధం.. యాదృచ్ఛికమంటే ఇదేనేమో..

Virender Sehwag: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైరై  సుమారు పదేండ్లు కావల్సి వస్తున్నది. వీరూ రిటైర్ అయినా అతడి రికార్డులు మాత్రం చెక్కు చెదరలేదు. భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ నజఫ్గడ్ నవాబ్ కు మార్చి 29తో ప్రత్యేక అనుబంధం ఉంది. 

2 Min read
Author : Srinivas M
| Updated : Mar 29 2022, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు తన క్రికెట్ కెరీర్ లో మార్చి 29తో ప్రత్యేక అనుబంధముంది.   ఈరోజేమైనా వీరూ బర్త్ డే అనుకుంటున్నారా..? అస్సలు కాదు.  భారత క్రికెట్ లో  అప్పటిదాకా అందని ద్రాక్షలా మిగిలపోయిన ట్రిపుల్ సెంచరీని వీరూ సాధించింది ఈరోజే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

2004లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత్.. ముల్తాన్ లో టెస్టు ఆడింది. ఈ టెస్టులో వీరూ.. భీకర బౌలింగ్ దాడి ఉన్న పాక్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ  ముల్తాన్ లో శివతాండవం ఆడాడు. 

310

ఈ మ్యాచులో అతడు ట్రిపుల్ సెంచరీ (309) కొట్టి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన  తొలి ఆటగాడిగా నిలిచాడు. వీరూ ట్రిపుల్ సెంచరీ సాధించింది మార్చి 29నే..

410

ఇదొక్కటే కాదండోయ్, తన రెండో ట్రిపుల్ సెంచరీని కూడా వీరూ ఇదే తారీఖున సాధించాడు. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత ఈ నజఫ్గడ్ నవాబ్.. 2008లో  భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా కు ట్రిపుల్ రుచి చూపించాడు. 

510

చెన్నై లో జరిగిన టెస్టులో  వీరూ.. మరో ట్రిపుల్ (319)  సాధించాడు.  అయితే ఈ రెండు టెస్టులలో మార్చి 29న ట్రిపుల్ సెంచరీలు సాధించిన వీరూ.. ఇదే తేదీన నిష్క్రమించడం గమనార్హం. 

610

ఇదిలాఉండగా వీరూ.. తన కార్ నెంబర్ కూడా  ‘2903’ కావడం విశేషం. ఇదే విషయమై  సెహ్వాగ్ తాజాగా ట్విట్టర్ లో  స్పందిస్తూ.. ‘తేదీలో ఏముంది..? మార్చి 29.. నా క్రికెట్ కెరీర్ లో చాలా  ప్రత్యేకమైన రోజు.  

710

పాకిస్థాన్ తో ముల్తాన్ లో ఇదే తారీఖున తొలి ట్రిపుల్ సెంచరీ కొట్టాను. తర్వాత నాలుగేండ్లకు మళ్లీ ఇదే డేట్ న దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాను.  యాధృశ్చికంగా నా కార్ నెంబర్ (2903) కావడం నిజంగా నమ్మలేకుండా ఉంది..’ అని ట్వీట్ చేశాడు. 

810

వీరూ చెప్పినట్టు  అతడి కెరీర్ లో ఎంతో ప్రాముఖ్యమైన ఈ ఘనతలు ఒకే తేదీన జరగడం..  తన కార్ నెంబర్ కూడా అదే తేదీతో కలిసుండటం యాధృశ్చికం కాక మరేంటి..? 

910

టెస్టులలో అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా గుర్తింపు పొందిన వీరూ.. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన వారిలో నాలుగో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.  ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ అతడికంటే ముందున్నారు. 

1010

అయితే వీరూ.. తన కెరీర్ లో మూడో ట్రిపుల్ కూడా సాధించేవాడే. 2010 లో ముంబై టెస్టులో 293 పరుగులు చేసిన సెహ్వాగ్ ను.. శ్రీలంక  స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఔట్ చేశాడు.  ఒకవేళ  వీరూ గనక  ఏడు పరుగులు చేసుంటే టెస్టులలో ట్రిపుల్ ట్రిపుల్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు అయి ఉండేవాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved