- Home
- Sports
- Cricket
- KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ దిమ్మదిరిగిపోయే డీల్
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ దిమ్మదిరిగిపోయే డీల్
KL Rahul: కేఎల్ రాహుల్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) భారీ డీల్ కోసం చూస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నారు.

కేఎల్ రాహుల్‌కు కేకేఆర్ నుంచి భారీ ఆఫర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ ముగిసిన వెంటనే, తదుపరి సీజన్‌కు ముందుగానే జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందుగా ట్రేడ్ విండో ఓపెన్ కావడంతో, పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
తాజాగా టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పేరు ఈ జాబితాలో చర్చకు వచ్చింది. అతని కోసం మరో ఐపీఎల్ ఫ్రాంఛైజీ భారీ ఆఫర్ చేసిందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
His bat made the loudest ROAR 🔥 pic.twitter.com/ZNArJNjn3c
— Delhi Capitals (@DelhiCapitals) April 6, 2025
KNOW
ఢిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్ రాహుల్‌కు గుడ్‌బై?
ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో 14 కోట్ల రూపాయల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, తాజా ట్రేడ్ విండోలో మరో ఫ్రాంచైజీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మాజీ ఐపీఎల్ విజేత అయిన కోల్ కతా నైట్‌రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ, కేఎల్ రాహుల్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది.
కేఎల్ రాహుల్ కోసం 25 కోట్ల రూపాయల భారీ ఆఫర్
సంబంధిత రిపోర్టుల ప్రకారం.. మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్ కతా నైట్‌రైడర్స్ జట్టు కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు 25 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇది రాహుల్ కెరీర్‌లోనే బిగ్ ఆఫర్. మొత్తం ఐపీఎల్ ట్రేడ్ చరిత్రలోనూ ఒక పెద్ద ట్రాన్సాక్షన్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మార్పిడి చేయడానికి కేకేఆర్ వద్ద ఎవరూ లేనందున ఈ ఒప్పందం కుదిరే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి కేకేఆర్ ఆసక్తి చూపడానికి ఒక ప్రధాన కారణం వారి అసిస్టెంట్ కోచ్, భారత మాజీ ఆల్ రౌండర్ అభిషేక్ నాయర్ ఉండటంగా వెల్లడిస్తున్నాయి.
జట్టులోకి వస్తే కేకేఆర్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్
కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్తుతం కొత్త నాయకత్వాన్ని వెతుకుతోంది. ప్రస్తుతం జట్టు వద్ద ఉన్న నాయకత్వ ఎంపికలపై పూర్తి విశ్వాసం లేకపోవడంతో మరో ప్లేయర్ కోసం చూస్తోందని సమాచారం. కాబట్టి కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకుని, అతనితో జట్టును నడిపించాలని ఫ్రాంచైజీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ ట్రేడ్ విండోలో జట్లు ఆర్థికంగా లేదా ఆటగాళ్ల మార్పిడి ద్వారా ఇతర జట్ల నుంచి ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కేఎల్ రాహుల్ కోసం 25 కోట్ల ఆఫర్ చేసిన కోల్ కతా ప్రత్యామ్నాయంగా ఎవరిని ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇవ్వనుంది అనేది ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం కీలకం కానుంది !
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినా, కేఎల్ రాహుల్‌ను విడిచిపెట్టాలా లేదా అన్న విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ రాహుల్‌ను విడుదల చేస్తే, డీసీ జట్టు స్ట్రాటజీలో కీలక మార్పులు జరుగుతాయన్నది ఖాయం.
కేఎల్ రాహుల్ పట్ల కోల్ కతా నైట్‌రైడర్స్ చూపిన ఆసక్తి, ఐపీఎల్ 2025లో జట్ల మధ్య భారీ మార్పులకు నాంది పలకనుందనే సంకేతాలిస్తోంది. ఈ ట్రేడ్ డీల్ ఫైనల్ అయితే, ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.