- Home
- Sports
- Cricket
- Ishan Kishan Birthday: ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్‌ను మార్చేశాయి తెలుసా !
Ishan Kishan Birthday: ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్‌ను మార్చేశాయి తెలుసా !
Ishan Kishan birthday: ఇషాన్ కిషన్ 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అని అతని కొన్ని ఇన్నింగ్స్ లు అతని కెరీర్ తో పాటు భారత క్రికెట్ పై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

ఇషాన్ కిషన్ బర్త్ డే : బౌలర్లను దంచికొట్టాడు
భారత యంగ్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తన 27వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1998లో బీహార్ రాష్ట్ర రాజధాని పట్నాలో జన్మించిన ఇషాన్, చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకుంటూ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. భారీ స్ట్రైక్ రేట్‌తో ఆటను మలుపు తిప్పే సామర్థ్యం కలిగిన ఈ ఎడమచేతి బ్యాట్స్‌మన్, ఝార్ఖండ్, ఇండియా ‘ఏ’ జట్ల తరఫున అద్భుత ప్రదర్శనలతో జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.
ఝార్ఖండ్ నుంచి భారత జాతీయ జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్
ఇషాన్ తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రాన్ని 2014లో, 16 ఏళ్ల వయసులో ఝార్ఖండ్ తరఫున చేశాడు. తొలి పది మ్యాచ్‌ల్లోనే ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేసి తన సత్తాను చాటాడు.
ఆ తర్వాత 2016లో బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో టీమ్ ఇండియా వెస్టిండీస్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
రంజీ ట్రోఫీలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన ఇషాన్ కిషన్
2016-17 రంజీ ట్రోఫీలో ఇషాన్ 10 మ్యాచ్‌ల్లో 799 పరుగులు చేసి, 57.07 సగటుతో దుమ్మురేపాడు. ఢిల్లీపై 273 పరుగుల అత్యధిక స్కోరు అతని ప్రతిభకు నిదర్శనం. ఇది అతని కెరీర్‌ను కొత్త దశలోకి తీసుకెళ్లింది.
ఐపీఎల్ లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో తొలుత గుజరాత్ లయన్స్ జట్టులో రెండు సీజన్లు ఆడాడు. ఆ తర్వాత 2018లో ముంబై ఇండియన్స్‌లో చేరి కీలకంగా నిలిచాడు. 2019, 2020లో ముంబై విజయాల్లో భాగమయ్యాడు. 2020లో అతను 516 పరుగులు చేసి, 145.76 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. 2025లో ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయగా, అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ మరోసారి తన టాలెంట్ చూపించాడు.
డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
2021లో ఇషాన్ తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం జూలైలో శ్రీలంకపై వన్డే అరంగేట్రం జరిగింది. 2023లో వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకొని, డొమినికాలో టెస్ట్ అరంగేట్రం చేశాడు.
ఇషాన్ ఇప్పటివరకు 2 టెస్టులు, 27 వన్డేలు, 34 టీ20 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 2,000 పరుగులకు చేరాడు. టీ20Iలో 796 పరుగులు, 124.37 స్ట్రైక్ రేట్ తో 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో 933 పరుగులు, 42.40 సగటు, 102.19 స్ట్రైక్ రేట్ తో ఆడుతూ ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు.
2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై చటోగ్రాంలో జరిగిన వన్డేలో ఇషాన్ 210 పరుగులు (131 బంతుల్లో, 24 ఫోర్లు, 10 సిక్సర్లు) చేసి డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను రికార్డు పుస్తకాలలో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్లేయర్లపై ఈ డబుల్ సెంచరీ, ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఇన్నింగ్స్ లు ఎంతగానో ప్రభావం చూపాయి.