Smriti Mandhana Birthday: భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన టాప్ 10 రికార్డులు
Smriti Mandhana: స్మృతి మంధాన 29వ పుట్టినరోజును జూలై 18న జరుపుకుంటోంది. ఆమె పేరుపై ఉన్న టాప్ 10 అంతర్జాతీయ క్రికెట్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

Smriti Mandhana birthday: స్మృతి మంధాన 29వ పుట్టినరోజు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, ఎలిగెంట్ లెఫ్ట్-హ్యాండర్ స్మృతి మంధాన, జూలై 18న తన 29వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆమె భారత మహిళల క్రికెట్‌ను నూతన శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
ఆమె సాధించిన విజయాలు భారత దేశంలోని అభిమానుల మన్ననలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా గుర్తింపు పొందాయి. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను అందించడంలో ఆమె నాయకత్వం ప్రధానంగా నిలిచింది.
భారత్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు
స్మృతి మంధాన ప్రస్తుతం భారత్ తరఫున మహిళల టీ20 అంతర్జాతీయల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉంది.
మొత్తం పరుగులు: 3982
టీ20 మ్యాచ్‌లు: 153
సగటు: 29.93
వన్డేల్లో అత్యధిక సెంచరీలు (భారత్ తరఫున)
స్మృతి మంధాన భారత్ తరఫున మహిళల వన్డేల్లో అత్యధికంగా 10 సెంచరీలు చేసింది. అంతర్జాతీయంగా నాల్గవ స్థానంలో ఉంది. మెగ్ లానింగ్ (15), సుజీ బేట్స్ (13), ట్యామీ బ్యూమాంట్ (11) తర్వాత స్మృతి మంధాన ఉన్నారు.
2. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (భారత్ తరఫున)
జూన్ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా 112 పరుగులు చేసి భారత మహిళా ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది.
3. మూడవ ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన స్మృతి మంధాన
టెస్టు, వన్డే, టీ20 మూడూ ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన.
4. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 200 పరుగుల మైలురాయి దాటి ఏకైక భారత ప్లేయర్ స్మృతి మంధాన
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 5 మ్యాచ్‌లలో 221 పరుగులు చేసింది. సగటు 44.20 నమోదు చేసింది.
5. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన స్మృతి మంధాన
2024లో ఆమె 4 సెంచరీలు కొట్టి, బెలిండా క్లార్క్, మెగ్ లానింగ్, సోఫీ డివైన్ వంటి లెజెండ్స్‌ను అధిగమించింది.
6. టీ20ల్లో ఒక ఏడాదిలో అత్యధిక ఫోర్లు (104)
2024లో 23 మ్యాచ్‌లలో ఆమె 104 బౌండరీలు కొట్టింది. గత రికార్డు హేలీ మాథ్యూస్ (99 ఫోర్లు, 2023) పేరుతో ఉండేది.
7. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (32) కొట్టిన స్మృతి మంధాన
50కిపైగా పరుగులు చేసిన మ్యాచుల సంఖ్యలో స్మృతి మంధాన 32 తో టాప్‌లో ఉంది. సుజీ బేట్స్ (29) తర్వాత స్థానంలో ఉంది.
8. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు (763) చేసిన స్మృతి మంధాన
2024లో ఆమె 23 మ్యాచ్‌లలో 763 పరుగులు చేసింది. టాప్ స్కోర్ 77 పరుగులు. సగటు 42.38 గా ఉంది.
9. భారత తరఫున టీ20ల్లో 4000 పరుగులు చేసిన తొలి, ఫాస్టెస్ట్ బ్యాటర్ స్మృతి మంధాన
94 ఇన్నింగ్స్‌లలోనే 4000 పరుగుల మైలురాయి చేరుకుంది. మిథాలీ రాజ్ 112 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నారు.
10. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్
క్రికెట్‌కు ఆమె అందించిన సేవలను గౌరవిస్తూ, భారత్‌లో మాత్రమే కాదు విదేశీ లీగ్‌లలోనూ ఆమెను అభిమానులు ఆదరిస్తున్నారు.