MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL Prize Money: ఐపీఎల్ విన్నర్, రన్నరప్ టీమ్లకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా.?

IPL Prize Money: ఐపీఎల్ విన్నర్, రన్నరప్ టీమ్లకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా.?

IPL Prize Money: ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య ఫైనల్ పోరు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 31 2026, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫైనల్‌లో గుజరాత్ స్కోర్ ఎంతంటే.?
Image Credit : ANI

ఫైనల్‌లో గుజరాత్ స్కోర్ ఎంతంటే.?

టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. జట్టుకు వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. కాగా త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగ‌ళూరు టీమ్ దూకుడుగా ఆడుతోంది. విజయానికి 24 ప‌రుగుల దూరంలో ఉంది. ఈ నేప‌థ్యంలో ఛాంపియ‌న్‌గా గెలిచిన జట్టుకు ఎంత బ‌హుమ‌తి ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఛాంపియన్ జట్టుకు రూ.20 కోట్ల బహుమతి
Image Credit : ANI

ఛాంపియన్ జట్టుకు రూ.20 కోట్ల బహుమతి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈసారి కూడా గత సీజన్ తరహాలోనే భారీ ప్రైజ్ మనీని కొనసాగిస్తోంది. ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు రూ.20 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నారు. ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.12.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. లీగ్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు కూడా ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించనున్నారు.

Related Articles

Related image1
మ‌హిళ‌ల‌కు అల‌ర్ట్‌.. జూన్ 2 త‌ర్వాత ఉచిత బ‌స్సులో ఆధార్ చెల్ల‌దు. మ‌రేం చేయాలంటే.?
Related image2
Railway: రైలు ప‌ట్టాల పక్క‌న ఉండే ఈ సిల్వ‌ర్ బాక్స్‌లు ఏంటి.? వాటి ప‌ని ఏంటో తెలుసా.?
34
వ్యక్తిగత అవార్డులకు కూడా భారీ నగదు
Image Credit : ANI

వ్యక్తిగత అవార్డులకు కూడా భారీ నగదు

టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ప్రదానం చేసే ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. అలాగే అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌తో పాటు రూ.10 లక్షలు అందజేస్తారు. సీజన్ మొత్తంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ ఆటగాడికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా ప్రకటిస్తారు.

44
అభిమానుల్లో ఉత్కంఠ
Image Credit : ANI

అభిమానుల్లో ఉత్కంఠ

ఐపీఎల్ ఫైనల్ అంటే కేవలం ట్రోఫీ పోరే కాదు, కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కోసం జరిగే సమరం కూడా. అందుకే విజేత ఎవరు అవుతారు, వ్యక్తిగత అవార్డులు ఎవరికి దక్కుతాయి అనే అంశాలపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ ఫలితంతో పాటు ప్రైజ్ మనీ పంపిణీ కూడా ఈ సీజన్‌కు గ్రాండ్ ఫినిష్ ఇవ్వనుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap Winner: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అత్యంత పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ !
Recommended image2
IPL 2026 Final: ఔటా? నాటౌటా? వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వివాదం.. అంపైర్ డెసిషన్‌తో హైడ్రామా !
Recommended image3
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ లో ఈ ఆరుగురు ప్లేయర్స్ ఆడితే రచ్చ రంబోలానే !
Related Stories
Recommended image1
మ‌హిళ‌ల‌కు అల‌ర్ట్‌.. జూన్ 2 త‌ర్వాత ఉచిత బ‌స్సులో ఆధార్ చెల్ల‌దు. మ‌రేం చేయాలంటే.?
Recommended image2
Railway: రైలు ప‌ట్టాల పక్క‌న ఉండే ఈ సిల్వ‌ర్ బాక్స్‌లు ఏంటి.? వాటి ప‌ని ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved