MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ లేడు! దినేశ్ కార్తీక్ ఉన్నాడుగా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫినిషర్‌గా చోటు ఇవ్వాలంటూ...

ధోనీ లేడు! దినేశ్ కార్తీక్ ఉన్నాడుగా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫినిషర్‌గా చోటు ఇవ్వాలంటూ...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా రావల్సినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయిన ప్లేయర్లలో దినేశ్ కార్తీక్ ఒకడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న దినేశ్ కార్తీక్... 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 08 2022, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

భారత జట్టు తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20 మ్యాచులు కలిపి సరిగ్గా 150 మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

పంజాబ్ కింగ్స్‌పై 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ బాది 14 పరుగులు, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఆర్‌సీబీకి రెండు విజయాలను అందించాడు..

39

ఇప్పటిదాకా మూడు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసినా అవుట్ కానీ దినేశ్ కార్తీక్‌... ఇప్పటిదాకా 201 ఐపీఎల్ మ్యాచులు ఆడి 3848 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 97 నాటౌట్.. 

49

36 ఏళ్ల వయసులో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న దినేశ్ కార్తీక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారతజట్టుకి ఫినిషర్‌గా ఉపయోగపడతాడని అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

59
RCB

RCB

‘ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతీ ఆటగాడు గాయాల బారిన పడుతున్నారు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో పర్ఫామెన్‌తో అదరగొడితే, సెలక్టర్లు కచ్ఛితంగా దినేశ్ కార్తీక్ గురించి ఆలోచిస్తారు...

69

ఐపీఎల్ 2022 సీజన్‌ని అతను బాగా మొదలెట్టాడు. దినేశ్ కార్తీక్‌కి అపారమైన అనుభవం ఉంది. అన్ని రకాల షాట్స్ ఆడగల పర్ఫెక్ట్ హిట్టర్...
 

79

ఎమ్మెస్ ధోనీ లేడు. మాహీ లాంటి ఫినిషర్ కోసం చూస్తుంటే మాత్రం దినేశ్ కార్తీక్ పర్ఫెక్ట్ రిప్లేస్‌మెంట్ అవుతాడు. టీమిండియాకి ఇప్పుడు చాలామంది వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు.

89

రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్... ఏ ప్లేయర్ అయినా గాయపడితే వారి స్థానంలో దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చేస్తాడు... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..

99

అయితే రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌, దినేశ్ కార్తీక్‌లతో పాటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం పోటీపడుతున్నాడు. సంజూ శాంసన్, లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరుపున రీఎంట్రీ ఇచ్చాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved