MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Womens World Cup 2025 : బోణీ కొట్టిన భారత్.. శ్రీలంకపై 58 పరుగుల తేడాతో గెలుపు

Womens World Cup 2025 : బోణీ కొట్టిన భారత్.. శ్రీలంకపై 58 పరుగుల తేడాతో గెలుపు

ICC Womens World Cup 2025 : వరల్డ్ కప్ 2025 తొలి మ్యాచ్‌లో భారత్ మహిళలు శ్రీలంకపై 58 పరుగుల తేడాతో విజయం సాధించారు. అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 01 2025, 12:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గెలుపుతో వరల్డ్ కప్ 2025 ప్రయాణం మొదలుపెట్టిన భారత్
Image Credit : Insta/indiancricketteam

గెలుపుతో వరల్డ్ కప్ 2025 ప్రయాణం మొదలుపెట్టిన భారత్

ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025ని భారత్ విజయంతో ప్రారంభించింది. గౌహతిలోని బార్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ 47 ఓవర్లకు కుదించారు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 269/8 పరుగులు చేసింది. డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం శ్రీలంకకు 271 పరుగుల లక్ష్యం ఉంచగా, శ్రీలంక 211 పరుగులకు ఆలౌట్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తడబడిన భారత బ్యాటింగ్
Image Credit : X/BCCIWomen

తడబడిన భారత బ్యాటింగ్

భారత్ బ్యాటింగ్ ఆరంభంలోనే షాకులు ఎదుర్కొంది. మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మంధానా ఈ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే ఔటయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. హర్లీన్ డియోల్ 48, ప్రతికా రావల్ 37 పరుగులతో కొంత సమయం క్రీజులో ఉన్నారు. వీరి తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు 124/6 స్కోరుతో ఒత్తిడిలో పడింది. శ్రీలంక తరఫున ఇనోకా రనవీరా అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశారు.

35
దీప్తి శర్మ-అమన్‌జోత్ భాగస్వామ్యం
Image Credit : X/BCCIWomen

దీప్తి శర్మ-అమన్‌జోత్ భాగస్వామ్యం

కష్ట సమయంలో దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ జట్టును కాపాడారు. ఈ జంట ఏడో వికెట్‌కి 103 పరుగుల కీలక భాగస్వామ్యం అందించింది. అమన్‌జోత్ కౌర్ 65 బంతుల్లో 57 పరుగులు చేశారు. దీప్తి శర్మ 53 బంతుల్లో 53 పరుగుల హాఫ్ సెంచరీ నాక్ ఆడారు. స్నేహ్ రాణా కూడా 15 బంతుల్లో 28 పరుగులు చేయడంతో భారత్ 269 పరుగులు చేసింది.

45
రన్‌చేజ్ లో కుప్పకూలిన శ్రీలంక
Image Credit : X/BCCIWomen

రన్‌చేజ్ లో కుప్పకూలిన శ్రీలంక

271 పరుగుల లక్ష్యంతో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభించింది. మంచి ఆరంభం లభించింది కానీ భారత బౌలర్లు అద్భుతమైన కమ్ బ్యాక్ తో లంక బ్యాటర్లను వరుసగా పెవిలియన్ కు పంపారు. కెప్టెన్ చమారి అటపట్టు 43 పరుగులు చేశారు. హర్షిత సమరవిక్రమ 29, నిలాక్షి డి సిల్వా 35 పరుగులతో పోరాడారు. కానీ, శ్రీలంక జట్టు 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది.

55
భారత్ vs శ్రీలంక మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం
Image Credit : X/BCCIWomen

భారత్ vs శ్రీలంక మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం

ఈ మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టారు. శ్రీ చరణి 2 వికెట్లు, ప్రతికా రావల్ 1 వికెట్ తీశారు. శ్రీలంక తరఫున ఇనోకా రనవీరా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.

ఈ విజయంతో భారత్ మహిళల జట్టు వరల్డ్ కప్ 2025ను విజయవంతంగా ఆరంభించింది. 124/6 పరిస్థితి నుంచి తిరిగి నిలబడి, ఆ తర్వాత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 58 పరుగుల తేడాతో గెలిచింది. అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించగా, బౌలర్లలో దీప్తి, స్నేహ్ రాణాలు మెరిశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 థీమ్ సాంగ్ ఏంటో తెలుసా?
Recommended image2
తిలక్ వర్మ: పాకిస్తాన్‌ను పచ్చడి చేసిన ఎలక్ట్రిషియన్ కొడుకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved