మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 థీమ్ సాంగ్ ఏంటో తెలుసా?
Womens Cricket World Cup 2025: మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన అధికారిక గీతం ‘బ్రింగ్ ఇట్ హోమ్’ విడుదలైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది.

మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 థీమ్ సాంగ్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 కోసం అధికారిక థీమ్ సాంగ్ ‘బ్రింగ్ ఇట్ హోమ్’ విడుదలైంది. ఈ పాటను భారత ప్రముఖ గాయని, బాలీవుడ్ స్టార్ శ్రేయా ఘోషల్ ఆలపించారు. పాటలో రిథమ్, మెలొడి, భావోద్వేగాల సమ్మేళనంలో ఉండగా, హైఎనర్జీ జోష్‌లో పాడారు. ఈ సాంగ్ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను ఏకం చేయడమేనని ఐసీసీ పేర్కొంది.
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 థీమ్ సాంగ్ ప్రత్యేకతలు
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 థీమ్ “తరికిటా తరికిటా తరికిటా ధోమ్”, “ధక్ ధక్, వీ బ్రింగ్ ఇట్ హోమ్” వంటి లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. పాట సాహిత్యం మహిళా క్రికెటర్ల కలలు, ధైర్యం, పట్టుదల ప్రతిబింబిస్తుంది. పాటతో పాటు విడుదలైన అధికారిక మ్యూజిక్ వీడియోలో మహిళల క్రికెట్ వారసత్వం, పాత క్రికెట్ క్షణాలు, డాన్సు ప్రదర్శనలు, రంగురంగుల దృశ్యాలు ఉన్నాయి.
శ్రేయా ఘోషల్ ఏమన్నారంటే?
గాయని శ్రేయా ఘోషల్ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 థీమ్ సాంగ్ పై మాట్లాడుతూ.. “మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 కోసం అధికారిక సాంగ్ పాడటం ఒక అద్భుతమైన అనుభవం. ఈ పాట మహిళల క్రికెట్ ఆత్మ, బలం, ఐక్యతను ప్రతిబింబిస్తుంది. నేను ఈ అద్బుతమైన క్షణాల్లో భాగమవ్వడం గర్వంగా ఉంది. అభిమానులను ఈ గీతం ఆకట్టుకోవడంతో పాటు ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
Feel the magic of Tarikita Tarikita Tarikita Dhom... feel the energy, sing the spirit, cheer the game 🏏
Full music video for Bring It Home out now #CWC25#BringItHome
(Primary artist) Singer: @shreyaghoshalpic.twitter.com/NaME3JxsN1— ICC (@ICC) September 25, 2025
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టికెట్ల ధరలు
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 కోసం ఐసీసీ చరిత్రలోనే తక్కువ టికెట్ ధరలు ప్రకటించింది. టికెట్ ధరలు కేవలం రూ.100 (సుమారు USD 1.14) నుంచి ప్రారంభమవుతాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ గ్లోబల్ ఈవెంట్‌లో కనిపించని తక్కువ ధరలు కావడం విశేషం. అభిమానులు Tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 మ్యాచ్‌ల వేదికలు
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2, 2025 వరకు జరగనుంది. భారత్, శ్రీలంకలలోని ఐదు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అవి..
• డీవై పాటిల్ స్టేడియం, నేవి ముంబై
• ACA స్టేడియం, గౌహతి
• హోల్కర్ స్టేడియం, ఇండోర్
• ACA-VDCA స్టేడియం, విశాఖపట్నం
• ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (శ్రీలంక)
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 థీమ్ సాంగ్ ఎక్కడ అందుబాటులో ఉంది?
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 థీమ్ సాంగ్ ఇప్పటికే Spotify, Apple Music, Amazon Music, JioSaavn, YouTube Music, Instagram, Facebook వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉంది. అభిమానులు ఎప్పుడైనా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో కూడా అందుబాటులోకి వచ్చింది.