MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వచ్చే ఏడాది జూలైలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు... ఆ మ్యాచ్ తర్వాతే సిరీస్‌పై...

వచ్చే ఏడాది జూలైలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు... ఆ మ్యాచ్ తర్వాతే సిరీస్‌పై...

ఐపీఎల్ 2021 సీజన్ రెండో ఫేజ్ ఆరంభానికి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో రద్దయిన ఐదో టెస్టుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఐదో టెస్టు రద్దు కావడంతో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియాకి సిరీస్ ఇవ్వడానికి ఇంగ్లాండ్ అంగీకరించలేదు... ఆ మ్యాచ్ ఫలితాన్ని ఇంగ్లాండ్ ఖాతాలో వేయడానికి ఐసీసీ, బీసీసీఐ ఒప్పుకోలేదు. దీంతో ఎట్టకేలకు ఐదో టెస్టు పెట్టడానకే ఫిక్స్ అయ్యాయి ఇరు జట్లు...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 22 2021, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఇప్పటికే భారత క్రికెట్ బోర్డుతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఈ టెస్టు సిరీస్ ఇక్కడితో ముగిసిందని, వచ్చే ఏడాది జరిగే మ్యాచ్‌ను ఏకైక టెస్టుగా పరిగణిస్తామని ప్రకటించాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కూడా టెస్టు సిరీస్‌లో భాగంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నాయి ఇరుదేశాల క్రికెట్ బోర్డులు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువరించింది.

311

‘భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టును 2022, జూలై 1న నిర్వహిస్తాం. ఈ ఏకైక టెస్టు ఫలితాన్ని బట్టి సిరీస్ విజేత నిర్ణయించబడుతుంది...’ అంటూ తెలిపింది ఈసీబీ...

411

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా ఎడ్బస్టన్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు జరగనుంది. ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా మూడు టీ20 మ్యాచులతో పాటు ఓ టెస్టు మ్యాచ్ ఆడనుంది...

511

తొలి టీ20 జూలై 7న ఏంజెల్స్ బౌల్‌లో, 9న రెండో టీ20, 10న మూడో ట20 మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత 12, 14, 17 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది...

611

జూలై 1 నుంచి 5 వరకూ టెస్టు మ్యాచ్ ఆడే భారతజట్టు, ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్‌లో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టుకి టెస్టులకు, వన్డే, టీ20లకు వేర్వేరు జట్లు ఉండడంతో వారికి ఇది సమస్యేమీ కాదు...

711

అయితే భారత జట్టు విషయానికి వస్తే టెస్టుల్లో, టీ20ల్లో ఆడే ప్లేయర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విరాట్, రోహిత్, రాహుల్, బుమ్రా... ఇలా ప్రధాన ప్లేయర్లు మూడు ఫార్మాట్లోనూ కీలకంగా మారారు...

811

బిజీ షెడ్యూల్ కారణంగా టెస్టు మ్యాచ్ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కి కీ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్,  పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి ప్లేయర్లను ఆడిస్తారేమో చూడాలి...

911

మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు ఆడడానికి భారత ఆటగాళ్లు అంగీకరించకపోవడంతో దాన్ని ‘ఫోర్‌ఫీట్‌’గా పరిగణించాలని ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ని కోరింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

1011

అయితే కరోనా కారణంగా వరుసగా క్రికెట్ సిరీస్‌లు వాయిదా పడుతున్న తరుణంలో పాజిటివ్ కేసుల కారణంగా రద్దయిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్  ఖాతాలో వేసేందుకు ఐసీసీ అంగీకరించలేదు...

1111

ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టు... మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే ఐదో టెస్టు రద్దైన తర్వాత మరో టెస్టు లేదా రెండు టీ20 మ్యాచులు అదనంగా ఆడేందుకు బీసీసీఐ అంగీకరించింది.... టెస్టు సిరీస్ ఫలితం తేల్చేందుకు టెస్టు మ్యాచ్ ఆడడానికే అంగీకరించింది ఇంగ్లాండ్..  

ఇవీ చదవండి: వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved