Asianet News TeluguAsianet News Telugu

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: మాహీ వీరాభిమానికి క్రేజ్ తెచ్చుకున్న పాకిస్తానీ బషీర్ చాచా... 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, పాక్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ టికెట్లను బషీర్‌కి స్వయంగా పంపిన ఎమ్మెస్ ధోనీ..

Welcome back Dhoni, Pakistan born Bashir Chacha is back to stadium welcome MS Dhoni
Author
India, First Published Oct 22, 2021, 4:33 PM IST | Last Updated Oct 22, 2021, 4:35 PM IST

 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఓ ముక్కలో చెప్పాలంటే మాస్ ఫాలోయింగ్‌లో మాహీ క్రేజ్ ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్ల కూడా సరిపోరు. పొరుగు దేశం పాకిస్తాన్‌లో ధోనీకి ఓ వీరాభిమాని ఉన్నాడు. అతని పేరు బషీర్ చాచా...

పాకిస్తాన్‌లో పుట్టిన 65 ఏళ్ల మహ్మద్ బషీర్‌‌కి క్రికెట్ అంటే పిచ్చి. చికాగోలో రెస్టారెంట్‌‌కి యజమాని అయిన మహ్మద్ బషీర్‌కి అమెరికా పాస్‌పోర్టు కూడా ఉంది. 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఎమ్మెస్ ధోనీ ఆటకి, కెప్టెన్సీకి వీరాభిమాని అయిన బషీర్ చాచా, స్టేడియానికి వచ్చి మ్యాచులు చూడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడు.

బిజినెస్‌లో నష్టం రావడంతో  ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అతనికి అవకాశం దొరికలేదు. అయితే బషీర్ చాచా పరిస్థితి తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, తన సొంత ఖర్చులతో మ్యాచ్ టిక్కెట్లను ఆయనకి పంపించాడు...

ధోనీ స్వయంగా తనను గుర్తుపెట్టుకుని మ్యాచ్ టికెట్లు పంపించడంతో ఉప్పొంగిపోయిన బషీర్ చాచా, ఆ మ్యాచ్‌లో పూర్తిగా మాహీ ఫోటోలతో నింపిన బట్టలతో ఆ మ్యాచుకి హాజరయ్యాడు. అంతేకాదు 2018 ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియాకి సపోర్ట్ చేస్తూ, భారత జెర్సీలో కనిపించాడు బషీర్ చాచా...

మాహీ రిటైర్మెంట్ తర్వాత స్టేడియంలో మ్యాచులు చూడడం మానేసిన బషీర్, ఇప్పుడు మళ్లీ మెంటర్ ధోనీని సపోర్ట్ చేసేందుకు స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. భారత్, పాకిస్తాన్ మధ్య  అక్టోబర్ 24న జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బషీర్ చాచా, ఆ రోజు ఓ వైపు భారత జెండా, మరోవైపు పాక్ జెండా రంగులతో నింపిన టీ షర్టు వేసుకోబోతున్నాడట... ఈ టీ షర్టు మధ్యలో ‘వెల్‌కం బ్యాక్ ధోనీ’ అంటూ రాసి ఉండడం విశేషం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి విపరీతమైన హైప్ వచ్చేసింది. మ్యాచ్‌కి ముందు శ్రీనగర్‌లో చెలరేగిన హింసాత్మక సంఘటనల కారణంగా ఇరుదేశాల మధ్య ఓ విధమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో క్రికెట్ మ్యాచ్ అవసరమా... అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు రాజకీయ నేతలు...

 

ఇవీ చదవండి: T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios