MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?

IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?

Chennai Super Kings: ఐపీఎల్ 2027 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులకు సిద్ధమైంది. రూ. 14.2 కోట్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసే యోచనలో ఉందని సమాచారం. అసలు ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 02 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్‌పై వేటు
Image Credit : ANI

చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్‌పై వేటు

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో భారీ ధరకు కొనుగోలు చేసిన రూ. 14.2 కోట్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ప్రముఖ స్పోర్ట్స్ సైట్ క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం, వేలంలో తమ దగ్గర నిధుల పరిమాణాన్ని పెంచుకునేందుకే మేనేజ్‌మెంట్ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 2023లో చివరిసారిగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. సీఎస్‌కే చరిత్రలోనే ఇలా వరుసగా మూడు సీజన్లు నాకౌట్ చేరకపోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే రాబోయే సీజన్ కోసం పక్కా ప్లాన్‌తో టీమ్‌ను రీబిల్డ్ చేయాలని మేనేజ్‌మెంట్ డిసైడ్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రశాంత్ వీర్ వర్సెస్ కార్తీక్ శర్మ: కోట్ల రూపాయల కొనుగోలు
Image Credit : ANI

ప్రశాంత్ వీర్ వర్సెస్ కార్తీక్ శర్మ: కోట్ల రూపాయల కొనుగోలు

గత వేలంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై భారీగా పెట్టుబడి పెట్టింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను రూ. 14.2 కోట్లకు దక్కించుకుంది. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మను కూడా సరిగ్గా అంతే మొత్తానికి రూ. 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రశాంత్ వీర్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.

అయితే ప్రశాంత్ వీర్ తన ధరకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. గత సీజన్‌లో మొత్తం 6 మ్యాచ్‌లలో 5 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసి కేవలం 90 రన్స్ మాత్రమే చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై చేసిన 43 పరుగులే అతడి బెస్ట్ స్కోరు. మరోవైపు బౌలింగ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

35
కార్తీక్ శర్మ పరిస్థితి ఏంటి?
Image Credit : ANI

కార్తీక్ శర్మ పరిస్థితి ఏంటి?

మరో భారీ సంతకం కార్తీక్ శర్మ పర్ఫార్మెన్స్ ప్రశాంత్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కార్తీక్ శర్మ 11 మ్యాచ్‌లలో 136.57 స్ట్రైక్ రేట్‌తో 295 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో కార్తీక్ శర్మను రిలీజ్ చేసే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయితే ప్రశాంత్ వీర్‌ను మాత్రం కచ్చితంగా రిలీజ్ చేసి, నిధులను పెంచుకోవాలని సీఎస్‌కే చూస్తోంది.

45
రూ. 20 కోట్లకు చేరనున్న సీఎస్కే పర్స్
Image Credit : X/ChennaiIPL

రూ. 20 కోట్లకు చేరనున్న సీఎస్కే పర్స్

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర రూ. 2.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. వార్షిక ఇంక్రిమెంట్ కింద లభించే రూ. 5 కోట్లను కలిపితే అది రూ. 7.4 కోట్లకు చేరుతుంది. ఇప్పుడు ప్రశాంత్ వీర్‌ను రిలీజ్ చేస్తే సీఎస్‌కే వద్ద ఉన్న పర్స్ అమౌంట్ ఏకంగా రూ. 21.6 కోట్లకు పెరుగుతుంది. ఇది డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలంలో మంచి క్వాలిటీ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు సీఎస్‌కేకు బాగా ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా, ప్రశాంత్ వీర్‌ను పూర్తిగా వదులుకోవాలని సీఎస్‌కే అనుకోవడం లేదని కూడా రిపోర్టులు చెబుతున్నాయి. వేలంలో తక్కువ ధరకు అతడిని మళ్లీ దక్కించుకోవడానికి ఫ్రాంచైజీ ప్రయత్నించే అవకాశం ఉంది. బీసీసీఐ కేటాయించిన డెడ్‌లైన్ ప్రకారం నవంబర్ 15 నాటికి ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది.

55
ముందున్న సవాళ్లు.. కొత్త కోచింగ్ స్టాఫ్
Image Credit : ANI

ముందున్న సవాళ్లు.. కొత్త కోచింగ్ స్టాఫ్

గత వేలంలో సీఎస్‌కే ఎంచుకున్న ప్లేయర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగం అస్సలు క్లిక్ అవ్వలేదు. బ్యాటింగ్ విభాగంలో కూడా సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్స్ ఉన్నప్పటికీ అనుకున్నంత ఫైర్‌పవర్ లభించలేదు.

ఈ క్రమంలోనే రాబోయే సీజన్ కోసం సీఎస్‌కే తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. టీమ్ కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బాధ్యతలు స్వీకరించగా, అసిస్టెంట్ కోచ్‌గా ఆల్బీ మోర్కెల్, బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ నియామకమయ్యారు. ఈ కొత్త స్టాఫ్ మార్గదర్శకత్వంలో ఐపీఎల్ 2027లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Recommended image2
Mumbai Indians: హార్దిక్ పాండ్యా ఔట్ ! ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు?
Recommended image3
IND vs NZ: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
Related Stories
Recommended image1
SRK: సల్మాన్ ఖాన్ నో చెప్పడంతో షారుఖ్ రేంజ్ మారిపోయింది.. ఆ ఒక్క సీక్రెట్ తెలిసి అందరూ షాక్!
Recommended image2
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved