సింగిల్ ఓవర్‌లో రెండు నో బాల్స్‌తో 8 బంతులు వేసిన బౌలర్... ప్రతీ బంతికి సిక్సర్ బాదిన బ్యాట్స్‌‌మెన్.. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో...

ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను సిక్సర్లు కొడితే... ‘వారెవా...’ అని ఆశ్చర్యపోతాం. అలాంటిది ఒకే ఓవర్‌లో 8 సిక్సర్ల కొట్టి ఏకంగా 50 పరుగులు రాబట్టారు ఓ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్... వినడానికి కాస్త వింతగా ఉన్నా... ఇది నిజం.

ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో నార్త్ సబర్బన్ కమ్యూనిటీ క్రికెట్ అసోసియేషన్‌ నిర్వహించిన క్రికెట్ లీగ్‌లో సోరెంటో డంకైన్ సీనియర్స్ క్లబ్, కింగ్‌స్టే ఉడ్‌లే సీనియర్స్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిందీ అద్భుతం...

సోరెంటో క్లబ్‌కి చెందిన సామ్ హారిసన్, ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో తీవ్ర ఒత్తిడికి గురైన బౌలర్ నాథన్ బెన్నెట్, నాలుగో బంతి నో బాల్‌గా వేశాడు. అది కూడా సిక్సర్.. ఆ తర్వాత బంతి, ఐదో బంతికి కూడా సిక్సర్ బాదాడు హారిసన్. ఎలా వేసినా బంతిని బౌండరీ బయటికి పంపిస్తుండడంతో మరో నో బాల్ వేశాడు బెన్నెట్. దాన్ని కూడా సిక్సర్‌గా మలిచిన హారిసన్. ఆ తర్వాత ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు...

ఇలా ఓవర్‌లో 8 బంతులు వేస్తే, 8 సిక్సర్లు వచ్చాయి, రెండు నో బాల్స్ కావడంతో మొత్తంగా ఓకే ఓవర్‌లో 50 పరుగులు వచ్చేశాయి. హారిసన్ దూకుడు ఇంతటితో ఆగలేదు. తాను ఎదుర్కొన్న ఆఖరి 13 బంతుల్లో 71 పరుగులు చేసిన హారిసన్, 53 బంతుల్లో 11 సిక్సర్లు, 6 ఫోర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. 

ఈ మ్యాచ్‌లో సామ్ హారీసన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా 40 ఓవర్లలో 276 పరుగులు చేసింది అతని జట్టు. ప్రత్యర్థి జట్టు 154 పరుగులకే పరిమితం కావడంతో సోరెంటో క్లబ్‌కి భారీ విజయం దక్కింది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు నాథన్ బెన్నెట్. ఇంతకుముందు 1990లో విల్లింగ్టన్ తరుపున ఆడిన బెర్ట్ వెన్స్ అనే న్యూజిలాండ్ బౌలర్ ఒకే ఓవర్‌లో 77 పరుగులు సమర్పించాడు. ఇందులో 17 నో బాల్స్ ఉండడం విశేషం.

ప్రత్యర్థి జట్టు రెండు ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన దశలో బౌలింగ్‌కి వచ్చిన బెర్ట్ వెన్స్, 17 నో బాల్స్‌తో 22 బంతుల ఓవర్ వేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఇందులో మొదటి లీగల్ డెలివరీ తర్వాత ఏకంగా 72 పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత నాలుగు బంతుల్లో 5 పరుగులు ఇచ్చాడు.

ఇన్ని నో బాల్స్ వేయడంతో అంపైర్, అతను ఎన్ని బాల్స్ వేశాడో కూడా మరిచిపోయి 5 బంతులకే ఓవర్ పూర్తయినట్టు ప్రకటించాడు. బెర్ట్ వెన్స్ బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి జట్టు విజయం అంచుల దాకా వచ్చినా, 1 పరుగు తేడాతో ఓడింది...

ఇవీ చదవండి: T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...