- Home
- Sports
- Cricket
- Team India: స్టార్ ప్లేయర్ కు షాక్.. 4వ టెస్టుకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఇంగ్లాండ్ పై గెలిచేనా?
Team India: స్టార్ ప్లేయర్ కు షాక్.. 4వ టెస్టుకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఇంగ్లాండ్ పై గెలిచేనా?
Team India: లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కీలక మార్పులకు సిద్ధమైంది. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ vs ఇంగ్లాండ్ 4వ టెస్టు.. జట్టులో బిగ్ ఛేంజ్
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. సిరీస్‌ను సమం చేయాలంటే నాలుగో టెస్ట్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జూలై 23 నుండి 27 వరకు జరిగే నాలుగో టెస్ట్‌కు ముందు భారత జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ వివరాలు గమనిస్తే..
కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ కు ఛాన్స్
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయిన టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ స్థానంలో యంగ్ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. కరుణ్ నాయర్ ఆడిన మూడు టెస్టుల్లో మొత్తం 131 పరుగులు మాత్రమే చేశారు. ఆతను నంబర్ 3లో నిలకడగా రాణించలేకపోయాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన అతను.. జాతీయ జట్టులో మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. కరుణ్ నాయర్ సగటు 21.83, స్ట్రైక్‌రేట్ 52.61గా ఉంది.
ఈ నేపథ్యంలో, దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ కు తిరిగి అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించవచ్చు. మొదటి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో డక్, రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసినా, అతని స్థిరమైన టెంపరమెంట్, శాంతమైన బ్యాటింగ్ శైలికి మంచి పేరుంది.
నితీష్ రెడ్డి లేదా వాషింగ్టన్ సుందర్.. ఎవరు బెంచ్ లో కూర్చుంటారు?
భారత్ ప్రస్తుతం ఇద్దరు ఆల్‌రౌండర్లతో ఆడుతోంది. వారిలో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. అయితే, వీరిలో ఎవరు నిలకడగా ఆడుతున్నారనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి.
వాషింగ్టన్ సుందర్, లార్డ్స్ టెస్టులో అద్భుత బౌలింగ్‌తో చరిత్ర సృష్టించారు. 21వ శతాబ్దంలో లార్డ్స్ వేదికపై భారత స్పిన్నర్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 4 వికెట్లు తీసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గత మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్ లో రాణిస్తూ కీలక పరుగులు సాధించారు. అందువల్ల, బౌలింగ్‌లో ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని అతన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాటింగ్‌ను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 45 పరుగులే చేశారు. బౌలింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అందువల్ల, ఈ స్థానంలో షార్దూల్ ఠాకూర్ కు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఉంది. షార్దూల్ ఇంగ్లాండ్ పరిస్థితులలో అనుభవంతో కూడిన స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
షార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వస్తే..?
ఇంగ్లాండ్ వాతావరణాన్ని బాగా అర్థం చేసుకున్న షార్దూల్ ఠాకూర్, తన స్వింగ్ బౌలింగ్‌తో కీలక పాత్ర పోషించగలడు. అతని అనుభవం, పేస్‌లో వేరియేషన్లు భారత బౌలింగ్ యూనిట్‌కు బలాన్నిస్తాయి. బ్యాటింగ్‌లోనూ అతను సత్తా చూపగలడు. దీంతో, అతనికి తిరిగి చోటులభించే అవకాశం ఎక్కువగా ఉంది.
లార్డ్స్ టెస్టు ఓటమి తరువాత బీసీసీఐ అనవసర మార్పులను తప్పించాలన్న దిశగా కూడా ఆలోచిస్తోంది. చిన్నతరహా తప్పిదాలే తేడాను తెచ్చాయని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందువల్లే, ప్రస్తుత గ్రూప్‌ను కొనసాగించి, తిరిగి ఫామ్ ను తీసుకువచ్చే ప్రయత్నాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
నాలుగో టెస్ట్ గెలిస్తేనే సిరీస్ రేసులో నిలిచేది!
ఇండియా నాలుగో టెస్టులో గెలిస్తే, సిరీస్‌ను 2-2తో సమం చేస్తూ చివరి టెస్టు నిర్ణయాత్మకంగా మారుతుంది. మాంచెస్టర్ వేదికగా జులై 23 నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియాకు ఇది మస్ట్ విన్ మ్యాచ్. అభిమానులు, విశ్లేషకుల దృష్టి ఇప్పుడు భారత జట్టు కూర్పుపైనే ఉంది.
భారత జట్టు అంచనా గమనిస్తే..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్షన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్

