హార్దిక్ పాండ్యా కొత్త లవ్ స్టోరీ.. ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో చక్కర్లు !
Hardik Pandya : భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో కొత్త లవ్ పై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే పాండ్యా లవ్ లో పడ్డారా !

ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి మరో అమ్మాయితో కనిపించి ఆయన వార్తల్లో నిలిచారు. ఢిల్లీ మోడల్ మహీకా శర్మతో ఆయన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఈ ఫోటోలు, వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో వారిద్దరి కొత్త రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలకు తెరలేపింది.
హార్దిక్, మహీకా కలిసి కనిపించిన ఈ వీడియోలో ఆయన కొత్త హెయిర్‌స్టైల్, లగ్జరీ కారు కూడా హైలైట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవ్వడంతో అభిమానులు వీరిద్దరి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నలు వేస్తున్నారు.
Indian cricketer Hardik Pandya spotted with his rumored girlfriend, model Mahieka Sharma, at Mumbai airport... pic.twitter.com/ehogz0x9Gz
— BS Kataria (@bskataria001) October 10, 2025
సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా క్లూస్ తో రూమర్లు
మహీకా శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని ఫోటోలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఆమె ధరించిన లియోపార్డ్ ప్రింట్ రోబ్ హార్దిక్ ఇంతకుముందు పోస్ట్ చేసిన దానికే సరిగ్గా సరిపోవడంతో ఊహాగానాలు పెరిగాయి. అంతేకాక, మహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 33 నంబర్‌ను ప్రదర్శించింది... ఇది హార్దిక్ పాండ్యా జెర్సీ నంబర్. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా ఈ వార్తలకు మరింత ఊపునిచ్చింది. అయితే, ఈ రూమర్లపై హార్దిక్ గాని, మహీకా గాని ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హార్దిక్ పాండ్యా: మహీకా శర్మ ఎవరు?
24 ఏళ్ల మహీకా శర్మ ఢిల్లీకి చెందిన మోడల్, నటీ. ఆమెకు ఎకనామిక్స్, ఫైనాన్స్, సైకాలజీ విభాగాల్లో డిగ్రీలు పూర్తి చేశారు. మణీష్ మల్హోత్రా, అనితా డొంగ్రే, తరుణ్ తహిలియాని వంటి ప్రముఖ డిజైనర్ల ఫ్యాషన్ షోలలో ఆమె మెరిసింది. తనిష్క్, వివో, యూనిక్లో వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తనకంటూ ఒక గుర్తింపు సంపాదించింది. సుమారు రూ.3.2 కోట్ల నెట్‌వర్త్ కలిగిన మహీకా ప్రస్తుతం మోడలింగ్ రంగంలో ఎదుగుతున్న స్టార్.
Hardik Pandey spotted with his rumoured girlfriend Mahieka Sharma at the airport 🧐#INDvWI#INDvsWI#HardikPandayapic.twitter.com/IGWi3V6TSU
— its Shruti (@Shruti_v31) October 10, 2025
నాటాషా స్టాంకోవిక్ తో హార్దిక్ పాండ్యా విడాకులు
హార్దిక్ పాండ్యా గతంలో సెర్బియన్ నటి నాటాషా స్టాంకోవిక్ ను వివాహం చేసుకున్నారు. వారికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. కానీ, 2024లో ఈ స్టార్ జోడీ విడిపోయింది. అయితే తమ కుమారుడిని బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు.
నాటాషా స్టాంకోవిక్ తో విడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా.. బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో లవ్ లో పడ్డారని రూమర్లు వినిపించాయి. కానీ ఆ సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు మహీకా శర్మతో ఆయన కనిపించడంతో మరో కొత్త చాప్టర్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
హార్దిక్ లగ్జరీ లైఫ్.. కొత్త లవ్ రూమర్లు
హార్దిక్ ఇటీవల రూ.4.5 కోట్లు విలువైన లాంబోర్గినీ కారును కొనుగోలు చేశారు. అదే కారులో ఆయన మహీకాతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. వీడియోలో ఆయన మహీకాకు ముందుగా వెళ్లడానికి దారి ఇవ్వడం, మీడియా కెమెరాలనుంచి దూరంగా ఉండడం గమనార్హం.
ఈ సంఘటనలతో హార్దిక్ పాండ్యా ప్రేమ జీవితం మళ్లీ చర్చనీయాంశమైంది. క్రికెట్ మైదానంలో తన ఆటతో వార్తల్లో నిలిచే పాండ్యా.. గ్రౌండ్ బయట తన వ్యక్తిగత జీవితంతో హాట్ టాపిక్ అవుతున్నారు. మహీకా శర్మతో పాండ్యా నిజంగా లవ్ లో ఉన్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం రాలేదు.