- Home
- Sports
- ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం
ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం
టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పేలవమైన టీ20 ప్రదర్శన కొనసాగుతోంది. అయితే, ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆ ఇద్దరిపై నమ్మకం ఉందని చెబుతున్నాడు. 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో..

గిల్, స్కై పేలవ ప్రదర్శన..
టీమిండియా క్రికెటర్లు శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 ఫామ్ అటు టీం మేనేజ్ మెంట్, ఇటు క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ వీరిద్దరూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.
ఒకప్పుడు తోపు.. ఇప్పుడు జీరో..
ఒకప్పుడు టాప్ టీ20 బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం పది పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. సూర్య బాటలోనే గిల్ కూడా టీ20ల్లో మంచి ప్రదర్శన చెయ్యట్లేదు. ఈ పరిణామాల మధ్య భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఇద్దరు ఆటగాళ్లపై నమ్మకం ఉందని అంటున్నాడు. 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ కచ్చితంగా రాణిస్తారని అభిషేక్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.
గిల్‌పై ప్రెజర్..
సంజూ శాంసన్‌ను తప్పించడం, వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి గిల్‌ను టీ20లు ఆడిస్తోంది టీం మేనేజ్ మెంట్.. అయితే జట్టులోకి వచ్చిన దగ్గర నుంచి ఓపెనర్‌గా వరుసగా విఫలమవుతున్నాడు. గత 20కి పైగా టీ20 ఇన్నింగ్స్‌లలో కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. టీ20 ప్రపంచకప్ 2026 నాటికి టీమిండియా పరిస్థితిపై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్‌గా గ్రీట్.. బ్యాటర్‌గా వేస్ట్..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా విజయవంతమవుతున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఈ ఏడాది జరిగిన మ్యాచ్‌లలో సూర్యకుమార్ కేవలం 213 పరుగులు మాత్రమే చేశాడు. అదేవిధంగా గిల్ కూడా 291 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ 50 వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గత సెప్టెంబర్‌లో ఓపెనర్‌గా వచ్చినప్పటి నుంచి అతడు ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు. ధర్మశాలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గిల్ దూకుడుగా ఆడలేకపోయాడు.
నమ్మకం ఉందన్న అభిషేక్..
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఈ ఇద్దరు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ.. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వీరి ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ మాట్లాడుతూ, నన్ను నమ్మండి, ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు మంచి విజయాలు అందిస్తారు' అని పునరుద్ఘాటించాడు. గిల్‌తో కలిసి చాలాకాలంగా ఆడుతున్నందున, అతడు ఏ పరిస్థితులలో, ఎలాంటి పిచ్‌లపై రాణించగలడో తనకు బాగా తెలుసని అభిషేక్ పేర్కొన్నాడు. గిల్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని అభిషేక్ శర్మ స్పష్టం చేశాడు.

