విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : ఎవరు బాగా రిచ్?
Virat Kohli vs Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన లెజెండరీ ప్లేయర్లు. ఐపీఎల్, బ్రాండ్ డీల్స్, బీసీసీఐ కాంట్రాక్టు, వ్యాపారాలతో భారీగానే సంపాదిస్తున్నారు. అయితే, వీరిద్దరిలో ఎవరు బాగా రిచ్?

విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : నెట్ వర్త్ ఎంత?
భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టాప్ లో ఉంటారని చెప్పడంలో సందేహంలో లేదు. వీరిద్దరూ క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ అదరగొడుతున్నారు. కోహ్లీ, రోహిత్ లను పోలిస్తే ఇద్దరి మధ్య ఆర్థిక వ్యత్యాసం చాలా ఉంది.
తాజా అంచనాల ప్రకారం, విరాట్ కోహ్లీ నెట్‌వర్త్ ₹1,050 కోట్లుగా ఉంది. రోహిత్ శర్మ సంపద ₹214 నుండి ₹230 కోట్ల మధ్యగా ఉంది. అంటే కోహ్లీ రోహిత్ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ధనవంతుడు. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలు కోహ్లీకి ఉన్న అంతర్జాతీయ గుర్తింపు, బ్రాండ్ విలువ, వ్యాపార పెట్టుబడులు.
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సంపాదన మార్గాలు చాలానే ఉన్నాయి. ఇద్దరూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) గ్రేడ్ A+ కాంట్రాక్ట్ కింద ఉన్నారు. దీంతో వారికి సంవత్సరానికి ₹7 కోట్లు జీతం లభిస్తుంది. ఈ విభాగంలో ఇద్దరికీ సమానమైన వేతనం ఉన్నప్పటికీ, కోహ్లీ ఇతర వనరుల ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నాడు.
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : ఐపీఎల్ ఆదాయాలు
ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్నాడు. అతన్ని ₹21 కోట్లకు ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా ఇప్పటివరకు ₹200 కోట్లకు పైగా సంపాదించాడు.
ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ (MI) ₹16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతని ఐపీఎల్ ఆదాయం ₹150–200 కోట్ల మధ్యగా ఉంది. ఇద్దరి ఐపీఎల్ ప్రదర్శనలు, మార్కెట్ విలువ భారత ఫ్రాంచైజీలకు కీలకంగా మారాయి.
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ అనేక ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. అయితే, కోహ్లీకి ఉన్న గ్లోబల్ బ్రాండ్ డీల్స్ మరింత పెద్దవి. కోహ్లీ Puma, MRF Tyres, Audi India వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు ప్రతినిధిగా ఉన్నాడు.
బ్రాండ్ ఒప్పందాల ద్వారా కోహ్లీకి వార్షికంగా ₹200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఇక రోహిత్ శర్మ కూడా అనేక కంపెనీలతో పని చేస్తున్నప్పటికీ, అతని బ్రాండ్ డీల్స్ విలువ కోహ్లీ కంటే చాలా తక్కువగా ఉంది.
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : వ్యాపారాలు, పెట్టుబడులు
విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. వ్యాపార రంగంలోనూ పెట్టుబడులు పెట్టాడు. కోహ్లీ వ్యాపారాల లిస్టు గమనిస్తే..
- One8 Hotels అనే లగ్జరీ హోటల్ చైన్
- Wrogn అనే ఫ్యాషన్ బ్రాండ్
- Chisel Fitness అనే జిమ్ నెట్‌వర్క్
అలాగే, FC Goa ఫుట్‌బాల్ జట్టులో వాటా కలిగి ఉన్నాడు.
ఇవి కాకుండా, కోహ్లీకి ముంబై, గురుగ్రామ్‌లలో ఉన్న ₹100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ ప్రాపర్టీలు, లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్నాయి. ఈ పెట్టుబడుల వల్ల అతని మొత్తం సంపద రోహిత్ శర్మ కంటే చాలా ఎక్కువగా ఉంది.
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ : గ్లోబల్ బ్రాండ్ విలువ
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ముందుగా ప్రవేశించినప్పటికీ, విరాట్ కోహ్లీ గ్లోబల్ స్థాయిలో ఎక్కువ గుర్తింపు పొందాడు. కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనలు, పాపులారిటీ, మార్కెట్ ఆకర్షణతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన భారత క్రీడాకారుడిగా నిలిచాడు. అతని బ్రాండ్ విలువ, ఆదాయం, ప్రభావం రోహిత్ కంటే చాలా ఎక్కువగా ఉంది.
మొత్తం గణాంకాల ప్రకారం, విరాట్ కోహ్లీ సంపద రోహిత్ శర్మ కంటే సుమారు ₹800 కోట్లకు పైగా ఎక్కువ. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న గుర్తింపు.. ఇవే కోహ్లీని భారత క్రికెట్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిపాయి.