RCB: ఆర్సీబీని అమ్మేస్తున్నారా.. బెంగళూరు జట్టు ఓనర్ ఏం చెప్పారో తెలుసా?
Royal Challengers Bangalore: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ పై గెలిచి బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఛాంపియన్ గా నిలిచింది. తమ తొలి టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీని అమ్మేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ క్రమంలోనే RCB ఓనర్లు స్పందించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హాట్ టాపిక్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును అమ్మేస్తున్నారనే వార్తలతో ఆ జట్టు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ వాటాలో వాటా విక్రయం జరుగుతున్నదనే ఊహాగానాలపై ఓనర్ డియాజియో పీఎల్‌సీ (Diageo Plc) మంగళవారం స్పందించింది.
ఆర్సీబీ అమ్మకం పై ఓనర్లు ఏం చేప్పారంటే?
యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా నడుస్తున్న ఆర్సీబీ జట్టుకు బ్రిటిష్ మద్యం తయారీ సంస్థ డియాజియో ఓనర్ గా ఉంది. జట్టును విక్రయిస్తున్నారనే వార్తలను ఊహాగానాలేనని పేర్కొంది. రాయల్ ఛాలెంజర్స్ జట్టు అమ్మకం వార్తలను ఖండించింది.
బ్లూంబర్గ్ కథనంతో హాట్ టాపిక్ గా ఆర్సీబీ
బ్లూంబర్గ్ ప్రచురించిన ఓ కథనంలో, డియాజియో కంపెనీ కొంత భాగస్వామ్యం లేదా మొత్తం క్లబ్ అమ్మకాలపై అన్వేషణలు జరుపుతోందని పేర్కొన్నది. ఆ కథనం ప్రకారం, ఈ చర్చల వెనుక కారణంగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలే ఉన్నాయని తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, IPL లో మద్యం, పొగాకు బ్రాండ్ల ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రచారాన్ని నిరోధించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా డియాజియో, ఇతర కంపెనీలు తమ పానీయాల్ని ప్రముఖ క్రీడాకారుల ద్వారా ప్రచారం చేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రకటనలపై నిషేధం ఉంది. అయితే, సాఫ్ట్ డ్రింక్స్, ఇతర బ్రాండ్ల రూపంలో కంపెనీలు ప్రచారానికి మార్గాలు వెతుకుతున్నాయి.
ఐపీఎల్ ప్రారంభంలో విజయ్ మాల్యా చేతిలో ఉన్న ఆర్సీబీ
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉంది. మొదట ఆర్సీబీ జట్టు విజయ్ మాల్యా ఆధ్వర్యంలోని కింగ్‌ఫిషర్ గ్రూప్‌కి చెందినది. 2012లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల కారణంగా మూతపడటంతో డియాజియో, మాల్యా మద్యం వ్యాపారం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఆర్సీబీని కూడా దక్కించుకుంది.
తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ
ఇటీవల ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జట్టు విజయోత్సవం జరుపుకుంది. విరాట్ కోహ్లీ, ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుల్లో ఒకరిగా ఉన్నారు. దీంతో ఆర్సీబీ జట్టు బ్రాండ్ విలువ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కూడా అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన టీమ్ గా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనత సాధించింది.
రిచెస్ట్ లీగ్ గా ఐపీఎల్ కు గుర్తింపు
ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా మరింతగా క్రేజ్ పెరుగుతోంది. రిచెస్ట్ లీగ్ లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఐపీఎల్.. ఫుట్‌బాల్ లీగ్‌లు అయిన NFL, ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఈ లీగ్‌కి వ్యాపార పరంగా ప్రాముఖ్యత పెరుగుతోంది. మూడు గంటల నిడివిగల మ్యాచ్‌లు కోట్లాది మంది వీక్షకులను ఆకర్షిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ వంటి జట్ల కొనుగోళ్లు స్పోర్ట్స్ ఇండస్ట్రీలో అత్యంత విలువైన పెట్టుబడులుగా మారుతున్నాయి. ఈ జట్టు అమ్మకం జరిగితే, భవిష్యత్తులో జట్ల విలువలకి కొత్త ప్రమాణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ప్రస్తుతానికి డియాజియో మాత్రం ఏ విధమైన అమ్మకానికి సంబంధించి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం వస్తున్న వార్తలు "ఊహాగానాలు మాత్రమే"నని తేల్చి చెప్పింది.