MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్ 2025 భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్‌ పై ఏబీ డివిలియర్స్ కామెంట్స్ వైరల్

ఆసియా కప్ 2025 భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్‌ పై ఏబీ డివిలియర్స్ కామెంట్స్ వైరల్

AB De Villiers Reacts To Shreyas Iyer: ఆసియా కప్ 2025 భారత టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్ కాకుండా వేరే కారణం ఏదైనా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 24 2025, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్ 2025 భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు దక్కని చోటు
Image Credit : Getty

ఆసియా కప్ 2025 భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు దక్కని చోటు

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎక్స్ లో డివిలియర్స్ స్పందిస్తూ.. అయ్యర్‌ను తప్పించడం అతని క్రికెట్ ప్రదర్శన కంటే వేరే కారణాలతో జరిగి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.

DID YOU
KNOW
?
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్, ప్లేయర్ గా రాణించాడు. 604 పరుగులు సాధించాడు. 50.33 సగటు, 175.07 స్ట్రైక్ రేట్ తో అతని బ్యాటింగ్ కొనసాగింది. అత్యధిక స్కోరు: 97* (నాటౌట్). 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంపై ఏబీడీ ఆశ్చర్యం
Image Credit : Getty

భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంపై ఏబీడీ ఆశ్చర్యం

ఏబీ డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ ను భారత జట్టు నుంచి తప్పించడం కఠిన నిర్ణయం. "ఈ జట్టులో శ్రేయస్‌కు ఎక్కడ స్థానం ఇస్తారనే విషయాలు నేను ఆలోచించాను. కానీ, గత కొన్నేళ్లుగా మంచి ఆటతీరు కనబరిచిన ఆటగాడిని ఇలా తప్పించడం అభిమానులకు నిరాశ కలిగించింది. నా జట్టులో ఉంటే శ్రేయాస్ ఖచ్చితంగా ఆడేవాడు. అతని ఆట కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవడం కష్టం" అని ఆయన ఏబీడీ అన్నారు.

35
డ్రెస్సింగ్ రూమ్ ఫాక్టర్ పై ఏబీడీ కామెంట్స్
Image Credit : Getty

డ్రెస్సింగ్ రూమ్ ఫాక్టర్ పై ఏబీడీ కామెంట్స్

తన అనుభవాన్ని పంచుకుంటూ ఏబీడీ డివిలియర్స్.. "ఒక ఆటగాడి నైపుణ్యం మాత్రమే కాకుండా, అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలా ఉంటాడు, ఇతర ఆటగాళ్లపై ప్రభావం ఎలా చూపుతాడు అనే అంశాలు కూడా ఎంపికలో కీలకం అవుతాయి. 50-50 పరిస్థితుల్లో, జట్టు వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉంచగల ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ, జట్టులో ఇప్పటికే చాలామంది లీడర్లు ఉన్నందువల్ల ఇది కూడా కారణంగా ఉండొచ్చు" అని అన్నారు.

45
ఐపీఎల్ లో శ్రేయాస్ సూపర్ షో
Image Credit : Getty

ఐపీఎల్ లో శ్రేయాస్ సూపర్ షో

18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దశాబ్దం తర్వాత ఫైనల్‌కు చేరింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఫైనల్ లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 2025 ఐపీఎల్ సీజన్ లో అయ్యర్ కూడా బ్యాటర్ గా, కెప్టెన్ గా అదరగొట్టాడు.

2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన శ్రేయాస్, 2020లో ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. పంజాబ్ కింగ్స్‌తో ఆడుతూ 13 ఏళ్ల తర్వాత ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో మెరుగైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు కానీ, ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో అయ్యర్ కు చోటుదక్కలేదు.

55
ఆసియా కప్ 2025 భారత జట్టు
Image Credit : Getty

ఆసియా కప్ 2025 భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ కుమార్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
బంగాళాఖాతంలో అల్పపీడనం: 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
Recommended image2
వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం.. టాప్-5 టీమ్ ఇన్నింగ్స్ లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved