MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం.. టాప్-5 టీమ్ ఇన్నింగ్స్ లు ఇవే

వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం.. టాప్-5 టీమ్ ఇన్నింగ్స్ లు ఇవే

Highest ODI Team Scores: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్ సాధించిన టీమ్ గా ఇంగ్లాండ్ టాప్ లో ఉంది. మొత్తంగా వన్డే క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించి మొదటి ఐదు స్థానాలు ఆక్రమించిన టీమ్స్  మ్యాచ్ ల వివరాలు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 24 2025, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వన్డే క్రికెట్ లోనూ పరుగుల సునామీ
Image Credit : Getty

వన్డే క్రికెట్ లోనూ పరుగుల సునామీ

Highest ODI Team Scores: వన్డే క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించిన మ్యాచ్ లు చాలానే ఉన్నాయి. ఆదివారం సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ధనాధన్ బ్యాటింగ్ తో 400+ పరుగులు చేసింది. ఆ టీమ్ లోని ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్ సెంచరీలు బాదారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 431/2 పరుగులు చేసింది. 

ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టడంతో సౌతాఫ్రికా కేవలం 155 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాపై ఆసీస్ 276 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, వన్డే క్రికెట్ లో అత్యధిక జట్టు స్కోర్లను గమనిస్తే టాప్ లో ఇంగ్లాండ్ ఉంది. అత్యధిక పరుగులు చేసిన జట్ల టాప్ 5 మ్యాచ్ ల వివరాలు గమనిస్తే..

DID YOU
KNOW
?
వన్డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన రోహిత్ శర్మ
నవంబర్ 13, 2014న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకపై రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ తో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును నెలకొల్పాడు. 264 పరుగుల ఇన్నింగ్స్ లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. మొత్తంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఇంగ్లాండ్ vs నెదర్లాండ్స్ - 498/4
Image Credit : Getty

1. ఇంగ్లాండ్ vs నెదర్లాండ్స్ - 498/4

వన్డే క్రికెట్ లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ సాధించిన జట్టు ఇంగ్లాండ్. 2022 జూన్ 17న అంస్టెల్వీన్‌లో ఇంగ్లాండ్ జట్టు వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌పై 498/4తో రికార్డు సృష్టించింది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ భారీ ఇన్నింగ్స్ ఆడింది. 

జోస్ బట్లర్ 162* (70 బంతులు) పరుగులు, డేవిడ్ మలన్ 125, ఫిల్ సాల్ట్ 122, లియామ్ లివింగ్ స్టోన్ 66* (22 బంతులు) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 232 పరుగుల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్ తరఫున స్కాట్ ఎడ్వర్డ్స్ 72* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

36
2. ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా - 481/6
Image Credit : Getty

2. ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా - 481/6

2018 జూన్ 19న నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ 481/6 స్కోరు చేసింది. ఇది వన్డే క్రికెట్ లో రెండో అత్యధిక జట్టు స్కోర్ గా ఉంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. 

అలెక్స్ హేల్స్ 147 (92 బంతులు) పరుగులు, జానీ బెయిర్‌స్టో 139, జేసన్ రాయ్ 82, ఇయాన్ మోర్గాన్ 67 (30 బంతులు) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా 239 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 242 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 51 పరుగులు చేశారు.

46
3. ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ - 444/3
Image Credit : Getty

3. ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ - 444/3

2016లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ పాకిస్తాన్‌పై 444/3 స్కోరు చేసింది. ప్రస్తుతం ఇది వన్డే క్రికెట్ లో మూడో అత్యధిక జట్టు స్కోరుగా ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ లో కూడా రాణించడంతో పాకిస్తాన్ 275 పరుగులకే ఆలౌటైంది. అలెక్స్ హేల్స్ 171 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. పాకిస్తాన్ తరఫున మొహమ్మద్ ఆమిర్ 58 పరుగులు చేశాడు.

56
4. శ్రీలంక vs నెదర్లాండ్స్ - 443/9
Image Credit : Getty

4. శ్రీలంక vs నెదర్లాండ్స్ - 443/9

వన్డే క్రికెట్ లో నాలుగో అత్యధిక స్కోరు శ్రీలంక సాధించింది. 2006 జూలై 4న అంస్టెల్వీన్‌లో శ్రీలంక 443/9 స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభం నుంచే దూకుడుగా భారీ ఇన్నింగ్స్ ఆడింది. నెదర్లాండ్స్ 248 పరుగులకు ఆలౌటైంది. సనత్ జయసూర్య 157 పరుగులు సెంచరీ నాక్ ఆడాడు. దిల్షాన్ 117 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెదర్లాండ్స్ తరఫున టిమ్ డి లీడే 51 పరుగులు చేశాడు.

66
5. సౌతాఫ్రికా vs వెస్టిండీస్ - 439/2
Image Credit : Getty

5. సౌతాఫ్రికా vs వెస్టిండీస్ - 439/2

2015 జనవరి 18న జొహానెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికా 439/2 స్కోరు చేసింది. ఇది ప్రస్తుతం వన్డే క్రికెట్ లో 5వ అత్యధిక జట్టు స్కోరు గా ఉంది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా విండీస్ బౌలింగ్ ను దంచికొట్టింది. 

భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 291/7 పరుగులకే పరిమితం అయింది. హషీమ్ ఆమ్లా 153* పరుగులు, ఏబీ డివిలియర్స్ 149, రిల్లీ రుస్సో 128 పరుగులు సూపర్ సెంచరీ నాక్ లు ఆడారు. వెస్టిండీస్ తరఫున రామ్‌డిన్ 57 పరుగులు చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
రింకూ సింగ్ సిక్సర్ల వర్షం.. 45 బంతుల్లోనే సెంచరీ.. వారికి గట్టిగానే ఇచ్చిపడేశాడు
Recommended image2
వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ స్కామ్.. క్లిక్‌ చేశారో ఖాతా ఖాళీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved