- Home
- Automobile
- Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Tata Motors Festive Sale: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందర్భంగా కార్లపై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏ మోడల్ కార్ల పై ఎంత తగ్గింపులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

పండుగ సీజన్‌లో టాటా మోటార్స్ భారీ ఆఫర్లు
పండుగ సీజన్‌లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్ ఆఫర్ల ద్వారా కస్టమర్లు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు.
పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ అలాగే ఎలక్ట్రిక్ కార్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ నుంచి నెక్సాన్, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వరకు చాలా మోడల్స్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. కారు మోడల్, వేరియంట్ బట్టి ఈ డిస్కౌంట్ మారుతూ ఉంటుంది. గరిష్ఠంగా రూ. 3.35 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ కార్లపై ఎంత తగ్గింపు ఉంది?
టాటా ఎంట్రీ లెవెల్ కార్లపై కూడా కంపెనీ ఆఫర్లు ఇస్తోంది. టియాగో పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లపై రూ. 35,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ. 15,000 నేరుగా డిస్కౌంట్, రూ. 5,000 ఓఈఎం సపోర్ట్, అలాగే ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 10,000 వరకు, స్క్రాపేజ్ కింద రూ. 15,000 వరకు బెనిఫిట్ వస్తుంది. టాటా టిగోర్ కొనేవారికి మొత్తం రూ. 30,000 వరకు తగ్గింపు దక్కుతుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ. 35,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
నెక్సాన్ ఎస్‌యూవీపై రూ. 75,000 వరకు సేవింగ్స్
టాటా క్రేజ్ ఉన్న నెక్సాన్ ఎస్‌యూవీ వివిధ వేరియంట్లపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. సిలెక్టెడ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ. 75,000 వరకు ఆదా చేసుకోవచ్చు. సీఎన్‌జీ మోడల్‌పై రూ. 60,000 వరకు బెనిఫిట్ ఉంది. నెక్సాన్ ఇతర పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 55,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. డీజిల్ మోడల్‌పై రూ. 20,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. నెక్సాన్ ఈవీ కొనేవాళ్లకు రూ. 45,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇందులో రూ. 10,000 గ్రీన్ బోనస్ కూడా కలిసి ఉంది.
పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు
టాటా పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లపై ప్రస్తుత ఆఫర్ కింద ఎలాంటి డిస్కౌంట్ లేదు. కాకపోతే ఎలక్ట్రిక్ మోడల్ పంచ్ ఈవీ వేరియంట్లపై మంచి సేవింగ్స్ ఉన్నాయి. పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్‌పై రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీడియం రేంజ్ వేరియంట్‌పై రూ. 1.25 లక్షలు, స్మార్ట్ వేరియంట్‌పై రూ. 95,000 వరకు తగ్గింపు ఉంది. ఇక అన్నింటికంటే ఎక్కువగా కర్వ్ ఈవీ సెలెక్టెడ్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ. 3.35 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కొన్ని వేరియంట్లకే వర్తిస్తుంది. ఎక్స్ ట్రిమ్స్ ఇందులో రావు. కర్వ్ ఈవీ క్రియేటివ్ వేరియంట్‌పై రూ. 2.85 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది.
హారియర్ ఈవీ, సఫారీ, ఇతర మోడళ్ల ఆఫర్లు
టాటా పెద్ద ఎస్‌యూవీలు హారియర్, సఫారీ డీజిల్ మోడళ్లపై రూ. 45,000 వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లు యాడ్ అయి ఉంటాయి. హారియర్ ఈవీ ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లపై రూ. 2.75 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ మోడళ్లపై కూడా రూ. 30,000 వరకు బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఈ ఆఫర్లు వివిధ ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి, కారు కొనేముందు మోడల్, వేరియంట్ ప్రకారం ఆఫర్ల రూల్స్ తెలుసుకోవడం మంచిది.








