MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

Best SUVs Under 8 Lakhs: బడ్జెట్‌ ఎస్‌యూవీలకు మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రూ.8 లక్షల లోపు బడ్జెట్‌లోనే మీకు బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్ అనే కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న మారుతి, టాటా, స్కోడా, హ్యుందాయ్ కార్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 21 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీ ఆప్షన్లు
Image Credit : chatgpt

రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీ ఆప్షన్లు

మీ బడ్జెట్ రూ. 8 లక్షల దగ్గర ఉందా? మీ కుటుంబం కోసం ఓ మంచి ఎస్‌యూవీ కొనాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో మీకు అదిరిపోయే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లు కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. అయితే ఈ నాలుగు సూపర్ ఆప్షన్లలో ఏది మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందో నిర్ణయించడం కొంచెం కష్టమే. ఈ పాపులర్ ఎస్‌యూవీల ధర, మైలేజ్, ఇంజిన్ అప్షన్లు, సేఫ్టీ, ఫీచర్ల వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మారుతి సుజుకి బ్రెజా: అదిరిపోయే లుక్.. నమ్మకమైన పెర్ఫార్మెన్స్
Image Credit : maruti suzuki

మారుతి సుజుకి బ్రెజా: అదిరిపోయే లుక్.. నమ్మకమైన పెర్ఫార్మెన్స్

మారుతి సుజుకి బ్రెజా ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ కార్ ఇంటీరియర్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలాగే కేబిన్‌లో మంచి లెగ్‌రూమ్ దొరుకుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే మాట్లాడితే, ఇందులో 9 ఇంచుల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌పీ ఇచ్చారు. ఈ కార్ ఈజీగా 17 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

36
టాటా నెక్సాన్: 5-స్టార్ సేఫ్టీ.. సూపర్ మైలేజ్
Image Credit : Gemini

టాటా నెక్సాన్: 5-స్టార్ సేఫ్టీ.. సూపర్ మైలేజ్

టాటా నెక్సాన్ ప్రారంభ ధర కూడా రూ. 7.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కార్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. నెక్సాన్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కింది. అంతేకాదు, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా వస్తాయి. కార్ లోపల 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి మోడరన్ ఫీచర్లు ఉన్నాయి. దీని పెట్రోల్ మోడల్ 17 నుంచి 17.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, డీజిల్ మోడల్ ఏకంగా 23 నుంచి 24 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

46
స్కోడా కైలాక్: ప్రీమియం డిజైన్.. పవర్ ఫుల్ ఇంజిన్
Image Credit : Skoda Website

స్కోడా కైలాక్: ప్రీమియం డిజైన్.. పవర్ ఫుల్ ఇంజిన్

స్కోడా కైలాక్ ప్రారంభ ధర రూ. 7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 115పీఎస్ పవర్, 178ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని బూట్ స్పేస్ 446 లీటర్లుగా ఉంది. ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఇది చాలా పెద్దదిగా సరిపోతుంది. ఇందులో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, రోలోవర్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ కార్ మైలేజ్ దాదాపు 18 నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది.

56
హ్యుందాయ్ వెన్యూ: అర్బన్ స్టైల్.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ
Image Credit : stockPhoto

హ్యుందాయ్ వెన్యూ: అర్బన్ స్టైల్.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ

హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వెన్యూ కేబిన్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఇందులో రిక్లైనింగ్ రియర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ ఇచ్చారు. ఇందులో 8 ఇంచుల టచ్‌స్క్రీన్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్. ఇంజిన్‌ను బట్టి దీని మైలేజ్ 17 నుంచి 21 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

66
మీ ఫ్యామిలీకి ఏ ఎస్‌యూవీ బెస్ట్?
Image Credit : Gemini

మీ ఫ్యామిలీకి ఏ ఎస్‌యూవీ బెస్ట్?

మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే మారుతి బ్రెజా అద్భుతమైన ఆప్షన్. మరింత సేఫ్టీ, డీజిల్ ఇంజిన్ కోరుకునే వారికి టాటా నెక్సాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. మీరు పవర్‌ఫుల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, పెద్ద బూట్ స్పేస్ ఇష్టపడితే స్కోడా కైలాక్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మోడరన్ డిజైన్, ఏడీఏఎస్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కావాలనుకునేవారికి హ్యుందాయ్ వెన్యూ నూటికి నూరుపాళ్లు సరైన కారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏ కారు టైర్లలో ఎంత గాలి ఉండాలి? సరైన ప్రెషర్ ఏంటో తెలుసా.?
Recommended image2
Flying Car: అప్పడు సినిమా.. ఇప్పుడు నిజం. అద్భుతం చేసి ఎలాన్ మస్క్
Recommended image3
Tesla Roadster: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది.. రాకెట్ టెక్నాలజీతో టెస్లా రోడ్‌స్టర్ ఫ్లయింగ్ కార్ ఇదే
Related Stories
Recommended image1
Best 5G Smartphones Under Rs 10000: రూ. 10 వేల లోపే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో టాప్-5 మొబైల్స్ ఇవే
Recommended image2
Post Office Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు 20 వేల ఆదాయం.. పోస్టాఫీసు సూపర్ సేవింగ్ స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved