MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Cars
  • రూ. 10 ల‌క్ష‌లు పెట్టి కారు కొంటున్నారా.? రెండేళ్లు ఆగి ఇలా చేస్తే, కారు దాదాపు ఉచితంగా పొందొచ్చు

రూ. 10 ల‌క్ష‌లు పెట్టి కారు కొంటున్నారా.? రెండేళ్లు ఆగి ఇలా చేస్తే, కారు దాదాపు ఉచితంగా పొందొచ్చు

Car Buying: కొందరు EMIపై కారు కొనుగోలు చేస్తారు. మరికొందరు ఏళ్ల తరబడి డబ్బు కూడబెట్టి ఒకేసారి నగదు చెల్లించి కారు తీసుకుంటారు. కానీ మీ చేతిలో రూ.10 లక్షలు ఉంటే.. వెంటనే కారు కొనడం కంటే రెండేళ్లు ఓపిక పడితే కారును ఫ్రీగా పొందొచ్చు. అదెలాగంటే..

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 07 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రూ.10 లక్షలు కారుకు పెట్టే బదులు.. ముందు పెట్టుబడిగా పెట్టండి
Image Credit : Gemini AI

రూ.10 లక్షలు కారుకు పెట్టే బదులు.. ముందు పెట్టుబడిగా పెట్టండి

మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఆ డబ్బుతో వెంటనే కారు కొనకుండా, మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే అంచనాతో లెక్కిస్తే... పెట్టుబడి రూ.10,00,000, రెండేళ్ల కాలానికి స‌గ‌టు రాబ‌డి 12 శాతంగా అంచ‌నా వేసినా రెండేళ్ల తర్వాత మీ పెట్టుబడి సుమారు రూ.12.5 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏ పని చేయకుండానే మీ డబ్బు సుమారు రూ.2.5 లక్షలు పెరిగినట్లే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇప్పుడు కారు కొనండి..
Image Credit : AI

ఇప్పుడు కారు కొనండి..

రెండేళ్ల తర్వాత మీ దగ్గర ఉన్న రూ.12.5 లక్షలను పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. దానిని సిస్ట‌మిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP)లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ప్రతి నెల అవసరమైనంత మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా డబ్బు మాత్రం పెట్టుబడిగానే కొనసాగుతుంది. ఇప్పుడు రూ.10 లక్షల విలువైన కారు కొనుగోలు చేశారని అనుకుందాం. 7 సంవత్సరాల లోన్ తీసుకుంటే నెలకు సుమారు రూ.25 వేల EMI రావచ్చు.

Related Articles

Related image1
ఇవేం టాయిలెట్స్ బాబోయ్‌.. బ‌య‌ట నుంచి అంతా క‌నిపిస్తుంది. కానీ లోపికి వెళ్తే మాత్రం
Related image2
Twin Towers: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత నిర్మాణం.. 47 అంత‌స్తుల ట్విన్ ట‌వ‌ర్స్‌. ఎక్క‌డంటే.?
36
ఇక్కడే అసలు ప్లాన్ మొదలవుతుంది.
Image Credit : Freepik

ఇక్కడే అసలు ప్లాన్ మొదలవుతుంది.

ప్రతి నెల మీ SWP నుంచి రూ.20 వేలు తీసుకుని EMIకి ఉపయోగించండి. మీ జేబు నుంచి చెల్లించాల్సింది కేవలం రూ.5 వేలు మాత్రమే. అంటే EMI మొత్తం మీరు భరించడం కాదు... మీ పెట్టుబడి కూడా మీకు తోడుగా పనిచేస్తుంది. డబ్బు పూర్తిగా అయిపోదు.. కంపౌండింగ్ మ్యాజిక్ ఇక్కడే కనిపిస్తుంది. చాలామందికి ఒక సందేహం వస్తుంది. ప్రతి నెల రూ.20 వేలు తీసుకుంటే పెట్టుబడి పూర్తిగా ఖాళీ అయిపోదా?

46
అసలు విషయం అదే.
Image Credit : Freepik

అసలు విషయం అదే.

SWP ద్వారా డబ్బు తీసుకుంటున్నప్పటికీ, మిగిలిన మొత్తం మార్కెట్లోనే పెట్టుబడిగా కొనసాగుతుంది. దానిపై మళ్లీ రాబడి వస్తూనే ఉంటుంది. దీనినే కంపౌండింగ్ ప్రభావం అంటారు. రఫ్ అంచనా ప్రకారం... ప్రారంభ పెట్టుబడి రూ.12.5 లక్షలు అయితే మీరు 7 ఏళ్ల‌పాటు ప్ర‌తీ నెల SWP ద్వారా రూ.20,000 విత్‌డ్రా చేసుకుంటే. ఈ మొత్తం కాలం తర్వాత కూడా సుమారు రూ.8 లక్షల వరకు పెట్టుబడి మిగిలి ఉండే అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులు, రాబడిని బట్టి ఈ మొత్తం ఎక్కువగానూ, తక్కువగానూ ఉండొచ్చు. అంటే మీరు కారు కూడా వాడుకున్నారు... అదే సమయంలో మీ పెట్టుబడిలో గణనీయమైన మొత్తం కూడా మిగిలే అవకాశం ఉంది.

56
మూడేళ్లు ఆగగలిగితే ఇంకా మంచి ఫలితం
Image Credit : Freepik

మూడేళ్లు ఆగగలిగితే ఇంకా మంచి ఫలితం

రెండేళ్లకు బదులుగా మూడేళ్లు వేచి ఉండగలిగితే పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడికి మరో ఏడాది అదనంగా కంపౌండింగ్ పనిచేస్తుంది. దీంతో కారుకు అవసరమైన EMIలో ఇంకా ఎక్కువ భాగాన్ని పెట్టుబడే భరించే అవకాశం ఉంటుంది. చివరికి మీ చేతి నుంచి వెళ్లే డబ్బు మరింత తగ్గుతుంది. కారు కొనడం తప్పు కాదు. కానీ కొన్ని నెలలు లేదా రెండుమూడేళ్లు ఓపిక పట్టడం చాలా పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వొచ్చు. ఈ చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ సంపదను పెంచడంలో కీలకంగా మారుతుంది.

66
ఎవరు ఈ స్ట్రాటజీని అనుసరించాలి? ఎవరు చేయకూడదు?
Image Credit : Asianet News

ఎవరు ఈ స్ట్రాటజీని అనుసరించాలి? ఎవరు చేయకూడదు?

ఈ విధానం ఇప్పటికే రూ.10 లక్షలు చేతిలో ఉన్నవారికి మాత్రమే సరిపోతుంది. కారు కొనడానికి పర్సనల్ లోన్ తీసుకుని, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్‌లో పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే లోన్ వడ్డీ భారం, మార్కెట్ రిస్క్ రెండూ కలిసి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మరొక విషయం గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం 12 శాతం రాబడే వస్తుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఇక్కడ చెప్పిన లెక్కలు కేవలం అవగాహన కోసం ఇచ్చిన రఫ్ అంచనా మాత్రమే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. వెంటనే కొనాలనే ఆత్రం కంటే, కొంతకాలం ఓపికతో పెట్టుబడి పెట్టడం చాలా సందర్భాల్లో మంచి ఆర్థిక నిర్ణయంగా మారుతుంది. డబ్బును ముందుగా మీ కోసం పనిచేయించగలిగితే, తర్వాత ఆ డబ్బుతో మీ కలలను నెరవేర్చుకోవడం మరింత సులభమవుతుంది.

గ‌మ‌నిక‌: ఈ కథనం కేవలం ఆర్థిక అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image2
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !
Related Stories
Recommended image1
ఇవేం టాయిలెట్స్ బాబోయ్‌.. బ‌య‌ట నుంచి అంతా క‌నిపిస్తుంది. కానీ లోపికి వెళ్తే మాత్రం
Recommended image2
Twin Towers: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత నిర్మాణం.. 47 అంత‌స్తుల ట్విన్ ట‌వ‌ర్స్‌. ఎక్క‌డంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved