MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Maruti Brezza 2026: కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్? పూర్తి ఫీచర్లు, ధరల వివరాలు

Maruti Brezza 2026: కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్? పూర్తి ఫీచర్లు, ధరల వివరాలు

2026 Maruti Brezza Facelift: 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కొత్త బూస్టర్‌జెట్ టర్బో ఇంజిన్‌తో లాంచ్ అయింది. రూ.7.40 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎస్​యూవీ వేరియంట్ల వివరాలు, ఇతర ఫీచర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 26 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త అవతార్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
Image Credit : Gemini

కొత్త అవతార్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

సబ్‌కాంప్యాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్‌లో మార్కెట్‌ను ఏలుతున్న మారుతి సుజుకి బ్రెజ్జా ఇప్పుడు సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్‌లోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో, కంపెనీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేయడంతో పాటు లేటెస్ట్ ఫీచర్లు, సరికొత్త ఇంజిన్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 7.40 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 12.89 లక్షలు వరకు ఉంది. ఈ ఎస్యూవీ లో LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు ప్రధాన వేరియంట్లు ఉన్నాయి. అంతేకాకుండా, పెట్రోల్, టర్బో-పెట్రోల్, కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్లను సైతం కస్టమర్ల ముందుకు తీసుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ ఆప్షన్లు, గేర్‌బాక్స్ వివరాలు
Image Credit : Maruti suzuki

2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ ఆప్షన్లు, గేర్‌బాక్స్ వివరాలు

2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన ఆకర్షణ కొత్తగా పరిచయం చేసిన 1.0-లీటర్ బూస్టర్‌జెట్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 110 PS పవర్, 170 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే జతచేశారు. ఈ ఇంజిన్ వేరియంట్‌ను LXi నుండి ZXi+ వరకు అన్ని వేరియంట్లలోనూ కొనుగోలు చేయవచ్చు.

ఇక రెండవ ఆప్షన్ 1.5-లీటర్ K15C న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 103 PS పవర్, 139 Nm టార్క్ ను ఇస్తుంది. LXi, VXi, ZXi వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్, VXi, ZXi, ZXi+ వేరియంట్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ పరంగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ 1.5-లీటర్ CNG మోడల్ కిలోకు ఏకంగా 26.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ సీఎన్జీ ఆప్షన్ కింద భాగంలో ట్యాంక్ అమరికతో LXi, VXi, ZXi వేరియంట్లలో లభిస్తుంది.

Related Articles

Related image1
Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా
Related image2
Cold Water vs Hot Water Bath: చన్నీళ్లా? వేడినీళ్లా? స్నానానికి ఏది బెస్ట్? సైన్స్ ఏం చెప్తోందో తెలుసా?
35
Maruti Brezza 2026: డిజైన్, ఇంటీరియర్, కంఫర్ట్ ఫీచర్లు
Image Credit : maruti suzuki

Maruti Brezza 2026: డిజైన్, ఇంటీరియర్, కంఫర్ట్ ఫీచర్లు

బాహ్య రూపంలో కొత్త డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్, కొత్త గ్రిల్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇంటీరియర్‌లో బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ కొనసాగించారు. అన్ని వేరియంట్లలోనూ రియర్ ఏసీ వెంట్లు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి.

టాప్ వేరియంట్ ZXi+ లో లేథరెట్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, మైలేజ్ ప్రొడక్టివిటీ పెంచేలా ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి లగ్జరీ ఫీచర్లు అమర్చారు. డ్రైవర్ సౌకర్యం కోసం టెలిస్కోపిక్ స్టీరింగ్, హెడ్ అప్ డిస్‌ప్లే, పుష్ బటన్ స్టార్ట్ కూడా ఉన్నాయి.

45
Maruti Brezza 2026: ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ ఫీచర్లు
Image Credit : meta ai

Maruti Brezza 2026: ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ ఫీచర్లు

ZXi+ వేరియంట్ లో 10.1 ఇంచ్ బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో ఆర్కామిస్ సరౌండ్ సౌండ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సుజుకి కనెక్ట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, ఓటీఏ అప్‌డేట్స్ ఉన్నాయి. బేస్ అండ్ మిడ్ వేరియంట్లలో 7 ఇంచ్ స్క్రీన్ లభిస్తుంది.

సేఫ్టీ విషయంలో మారుతి ఎక్కడా తగ్గలేదు. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ కార్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఇచ్చారు. టర్బో వేరియంట్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి లెవెల్ 1 ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

55
Maruti Brezza 2026: ఏ వేరియంట్ కొనడం బెస్ట్?
Image Credit : Maruti Suzuki

Maruti Brezza 2026: ఏ వేరియంట్ కొనడం బెస్ట్?

మీరు ఏ వేరియంట్ ఎంచుకోవాలో గందరగోళంగా ఉంటే, ZXi వేరియంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వాల్యూ ఫర్ మనీ. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి డైలీ యూజ్ ఫీచర్లన్నీ ఇందులో లభిస్తాయి. పైగా ఇది పెట్రోల్, ఆటోమేటిక్, సీఎన్జీ మూడింటిలోనూ అందుబాటులో ఉంది.

మీకు లగ్జరీ ఫీచర్లు, 10.1-ఇంచ్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు కావాలనుకుంటే ZXi+ కి వెళ్లవచ్చు. తక్కువ బడ్జెట్‌లో సేఫ్టీ, పవర్ కావాలనుకునే వారికి LXi, VXi కూడా మంచి ఎంపికలే. టాటా నెక్షాన్, హ్యుందాయ్ వేన్యూ, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి మోడళ్లకు ఈ 2026 బ్రెజ్జా గట్టి పోటీ ఇస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 40 వేల జీత‌మున్నా ఈ ల‌గ్జ‌రీ కారుకు ఓన‌ర్ అయిపోవ‌చ్చు.. లుక్‌లోనే కాదు ఫీచ‌ర్ల‌లో కూడా తోపు
Recommended image2
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
Recommended image3
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
Related Stories
Recommended image1
Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా
Recommended image2
Cold Water vs Hot Water Bath: చన్నీళ్లా? వేడినీళ్లా? స్నానానికి ఏది బెస్ట్? సైన్స్ ఏం చెప్తోందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved