MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Careers
  • High Paying Jobs : 2026లో ఈ ఉద్యోగాలకే ఫుల్ డిమాండ్.. ఎక్కువ జీతం కలిగిన టాప్ ప్రైవేట్ జాబ్స్ ఇవే

High Paying Jobs : 2026లో ఈ ఉద్యోగాలకే ఫుల్ డిమాండ్.. ఎక్కువ జీతం కలిగిన టాప్ ప్రైవేట్ జాబ్స్ ఇవే

ఈ ఏడాది ఇండియాలో ఏ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉండబోతోంది? ఏ రంగాల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి? వైద్యం, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ వంటి రంగాల్లోని టాప్ జాబ్స్, వాటి సగటు జీతాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 20 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అత్యధిక శాలరీ, మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలేవో తెలుసా?
Image Credit : Getty

అత్యధిక శాలరీ, మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలేవో తెలుసా?

High Paying Jobs : మీరు స్టూడెంటా? లేక చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే జాబ్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలాంటి మార్పులు వస్తున్నాయి,  ఏ రంగానికి ఎక్కువ డిమాండ్ ఉంది, దేనిలో ఎక్కువ జీతం వస్తుందో తెలుసుకోవడం మీ భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి చాలా అవసరం. ఈ నేపథ్యంలో Indeed జాబ్ పోర్టల్ తాజాగా ఆసక్తికరమైన రిపోర్ట్ విడుదల చేసింది. 2026 లో ఇండియాలోనే ఎక్కువ జీతం, ఎక్కువ జాబ్ పోస్టింగ్‌లు ఉండే ఉద్యోగాల లిస్ట్ ను విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మారుతున్న జాబ్ మార్కెట్
Image Credit : Getty

మారుతున్న జాబ్ మార్కెట్

'ఐటీలో చేరితేనే ఎక్కువ జీతం' అనే అభిప్రాయం చాలా ఏళ్లుగా ఉంది. కానీ 2026 నాటికి ఈ పరిస్థితి నెమ్మదిగా మారింది. టెక్నాలజీ రంగంలో పైథాన్ డెవలపర్ (Python Developer) వంటి పోస్టులకు డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం వైద్యం (Healthcare), ఇంజనీరింగ్, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్వాంటిటీ సర్వేయర్లు (Quantity Surveyors), డెర్మటాలజిస్ట్‌ల (Dermatologists) కోసం జాబ్ పోస్టింగ్‌లు 200% వరకు పెరగడం పెద్ద మార్పు.

36
అధిక జీతం, డిమాండ్ ఉన్న టాప్ జాబ్స్
Image Credit : FREEPIK

అధిక జీతం, డిమాండ్ ఉన్న టాప్ జాబ్స్

Indeed (ఇండీడ్) రిపోర్ట్ ప్రకారం నెలవారీ సగటు జీతం, ఉద్యోగ అవకాశాల్లో వార్షిక వృద్ధి (YoY) వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

• డెర్మటాలజిస్ట్ (Dermatologist) : ₹93,411 (182% వృద్ధి)

• చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) : ₹82,528 (171% వృద్ధి)

• సీనియర్ ఆర్కిటెక్ట్ (Senior Architect) : ₹48,457 (136% వృద్ధి)

• హెడ్ ఆఫ్ సేల్స్ (Head Of Sales ): ₹56,823 (114% వృద్ధి)

• ప్రిన్సిపల్ (Principal) : ₹56,791 (55% వృద్ధి)

• అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) : ₹55,638 (94% వృద్ధి)

• సీనియర్ సివిల్ ఇంజనీర్ (Senior Civil Engineer) : ₹42,526 (154% వృద్ధి)

• మెడికల్ ఆఫీసర్ (Medical Officer) : ₹41,070 (128% వృద్ధి)

• పైథాన్ డెవలపర్ (Python Developer) : ₹34,798 (0% వృద్ధి)

• క్వాంటిటీ సర్వేయర్ (Quantity Surveyor) : ₹32,205 (198% వృద్ధి)

• రియల్ ఎస్టేట్ అనలిస్ట్ (Real Estate Analyst) : ₹30,281 (154% వృద్ధి)

46
 జోరుగా ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్
Image Credit : AI meta

జోరుగా ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్

2026 సంవత్సరం ఇంజనీరింగ్, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు జాబ్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల (Infrastructure) ప్రాజెక్టులు విస్తరిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. దీంతో సివిల్ ఇంజనీర్లు, సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ల వంటి అనేక పోస్టులకు డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది.

56
లీడర్షిప్ రోల్స్ కి డిమాండ్
Image Credit : Getty

లీడర్షిప్ రోల్స్ కి డిమాండ్

ఏ సంస్థనైనా బాధ్యతగా నడిపించడానికి సమర్థులైన నాయకులు అవసరం. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), హెడ్ ఆఫ్ సేల్స్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్‌ఆర్ మేనేజర్ వంటి నాయకత్వ, మేనేజ్‌మెంట్ పోస్టులకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. పోటీ ప్రపంచంలో కంపెనీ వృద్ధిని నిర్వహించడానికి, ఖర్చులను నియంత్రించడానికి సమర్థులకు ఎక్కువ జీతం ఇవ్వడానికి సంస్థలు వెనుకాడవు.

66
కొత్త ట్రెండ్‌ ఉద్యోగాలు
Image Credit : Getty

కొత్త ట్రెండ్‌ ఉద్యోగాలు

వైద్యం, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియా మేనేజర్, ట్రావెల్ కన్సల్టెంట్, ఇంటీరియర్ డిజైనర్ వంటి పోస్టులు కస్టమర్ల కొత్త అవసరాలను తీర్చే విధంగా ఎదుగుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్, పర్యాటక రంగం పుంజుకోవడంతో ఈ రంగాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి.

2026 నాటికి జాబ్ మార్కెట్ కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లోనూ విస్తరించింది. కాబట్టి ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలను (Skills) పెంచుకుని, ట్రెండింగ్‌లో ఉన్న ఈ రంగాలపై దృష్టి సారిస్తే, ఎక్కువ జీతంతో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
వ్యాపారం
స్థిరాస్తి
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!
Recommended image2
High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved