MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Careers
  • Salary: దేశంలో ఎక్కువ జీతం వ‌చ్చే రంగం ఏంటి.? ఏ న‌గ‌రాల్లో జీతాలు ఎక్కువ‌గా పెరుగుతున్నాయి.?

Salary: దేశంలో ఎక్కువ జీతం వ‌చ్చే రంగం ఏంటి.? ఏ న‌గ‌రాల్లో జీతాలు ఎక్కువ‌గా పెరుగుతున్నాయి.?

దేశంలో సొంతంగా వ్యాపారం చేసే వారి కంటే ఉద్యోగం చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే ఏ రంగంలో ఉద్యోగం చేసే వారికి అధికంగా జీతాలు వ‌స్తున్నాయి.? ఏ న‌గ‌రాల్లో జీతాలు వేగంగా పెరుగుతున్నాయి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 04 2025, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేత‌నాల్లో టాప్ ప్లేస్‌లో
Image Credit : Gemini

వేత‌నాల్లో టాప్ ప్లేస్‌లో

దేశంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నా, ఐటీ రంగానికి ఉండే ఆకర్షణ ప్ర‌త్యేమ‌ని తెలిసిందే. పెరుగుతోన్న ప్ర‌పంచ‌రీక‌ర‌ణ‌, టెక్నాల‌జీ కార‌ణంగా ఈ రంగం రోజురోజుకీ విస్త‌రిస్తోంది. తాజాగా ఇండీడ్ పేమ్యాప్ అనే ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే ప్రకారం... దేశంలో అత్యధిక వేతనాలు అందిస్తున్న రంగాల్లో ఐటీ మొద‌టి స్థానంలో నిలిచింది.

25
టెక్ రంగంలో ఫ్రెషర్లు ఎంత సంపాదిస్తున్నారు?
Image Credit : Gemini

టెక్ రంగంలో ఫ్రెషర్లు ఎంత సంపాదిస్తున్నారు?

ఇండీడ్ సర్వే ప్రకారం టెక్ రంగంలో ఉద్యోగాన్ని మొదలుపెట్టే ఫ్రెషర్లు నెలకు సగటున రూ.28,600 వరకు వేతనం పొందుతున్నారని తేలింది. అదే ఐదు నుంచి ఏడు ఏళ్ల అనుభవం ఉన్నవారైతే నెలకు దాదాపు రూ.68,900 వరకు సంపాదిస్తున్నారని స‌ర్వేలో వెల్ల‌డైంది. విద్య‌, అనుభ‌వం, నైపుణ్యాల ఆధారంగా ఈ వేత‌నాల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయ‌ని నివేదిక పేర్కొంది.

Related Articles

Related image1
Telangana: ఇకపై ఇంటర్ కాలేజీలు ఉండవా.? విద్యా వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు
Related image2
Hyderabad: హైద‌రాబాదీల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 4 కొత్త స్కైవాక్‌లు, ఎక్క‌డెక్క‌డంటే
35
తయారీ, టెలికాం రంగాల్లో స్థిరమైన ఆదాయం
Image Credit : Getty

తయారీ, టెలికాం రంగాల్లో స్థిరమైన ఆదాయం

టెక్ తర్వాత అత్యధిక వేతనాలు అందించే రంగాల్లో తయారీ (Manufacturing), టెలికాం (Telecom) ఉన్నాయి. ఈ విభాగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు నెలకు రూ.28,100 నుంచి రూ.28,300 వరకు జీతం లభిస్తోందని సర్వే వెల్లడించింది. ఇక 5-8 ఏళ్ల అనుభవం కలిగినవారికి రూ.67,700 నుంచి రూ.68,200 వరకు వేతనాలు అందుతున్నట్లు పేర్కొంది.

45
సాఫ్ట్‌వేర్, మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు భారీ జీతాలు
Image Credit : Getty

సాఫ్ట్‌వేర్, మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు భారీ జీతాలు

ఇండీడ్‌ సర్వేలో పేర్కొన్న విధంగా, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, హెచ్‌ఆర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో కూడా ఆకర్షణీయ జీతాలే లభిస్తున్నాయి. ప్రారంభ స్థాయిలో జీతం రూ.25,000 నుంచి రూ.30,500 వరకు ఉండగా, ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజర్ల వంటి మిడిల్ లెవల్ ఉద్యోగులకు నెలకు రూ.85,500 వరకూ వేతనాలు అందుతున్నాయి. అంటే, నైపుణ్యం పెరిగితే సంపాదనలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.

55
జీతాలు పెరిగినా… అసంతృప్తి పెరుగుతుందా?
Image Credit : Getty

జీతాలు పెరిగినా… అసంతృప్తి పెరుగుతుందా?

ఐటీ సహా ఇతర రంగాల్లో జీతాల పెరుగుదల కనిపిస్తున్నా, ఉద్యోగుల్లో ఆర్థిక ఒత్తిడి మాత్రం తగ్గటం లేదని స‌ర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 69 శాతం మంది తమ ఆదాయం జీవన వ్యయాలకు సరిపడటం లేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, పుణె వంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువ‌గా ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో మాత్రం వేతన పెంపు వేగంగా జరుగుతోందని కూడా ఈ నివేదిక తెలియజేసింది. ఈ స‌ర్వేను ఇండీడ్ సంస్థ దేశవ్యాప్తంగా 1,311 మంది కంపెనీ యజమానులు, 2,531 మంది ఉద్యోగులను ప్రశ్నించి రూపొందించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Exam Tips : ఎగ్జామ్స్ కు ముందు టెన్షన్ తగ్గించుకునే... టాప్ 5 గోల్డెన్ టిప్స్
Recommended image2
High Paying Jobs : 2026లో ఈ ఉద్యోగాలకే ఫుల్ డిమాండ్.. ఎక్కువ జీతం కలిగిన టాప్ ప్రైవేట్ జాబ్స్ ఇవే
Recommended image3
JEE Main 2026 : అమ్మ త్యాగం చేసింది.. కొడుకులు చరిత్ర సృష్టించారు ! వైరల్ అవుతున్న ట్విన్స్ స్టోరీ
Related Stories
Recommended image1
Telangana: ఇకపై ఇంటర్ కాలేజీలు ఉండవా.? విద్యా వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు
Recommended image2
Hyderabad: హైద‌రాబాదీల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 4 కొత్త స్కైవాక్‌లు, ఎక్క‌డెక్క‌డంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved