- Home
- Careers
- Study in singapore: సింగపూర్‌లో చదుకోవడానికి ఎంత ఖర్చవుతుంది.? ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి.?
Study in singapore: సింగపూర్‌లో చదుకోవడానికి ఎంత ఖర్చవుతుంది.? ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి.?
Study in singapore: విదేశాల్లో విద్య అనగానే చాలా మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అనుకుంటారు. అయితే భారతదేశానికి సమీపంలో ఉన్న సింగపూర్‌లో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా.?

సింగపూర్‌పై పెరుగుతోన్న ఆసక్తి
సింగపూర్ ప్రస్తుతం భారత విద్యార్థులకు ప్రధాన విద్యా కేంద్రంగా మారింది. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, అంతర్జాతీయ ప్రమాణాల కోర్సులు, మంచి ఉద్యోగ అవకాశాలు ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. 2025 నాటికి సింగపూర్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థుల సంఖ్య 33,250కు చేరింది. ఈ సమాచారం ఇటీవల రాజ్యసభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్, ఐటీ, ఫైనాన్స్ వంటి రంగాల్లో సింగపూర్ డిగ్రీలకు గ్లోబల్ గుర్తింపు ఉంది.
సింగపూర్ యూనివర్సిటీలు, ప్రపంచ ర్యాంకింగ్స్
సింగపూర్‌లో మొత్తం 34 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో ఆరు జాతీయ సంస్థలు ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎప్పటికప్పుడు టాప్ స్థానాల్లో నిలిచే రెండు ప్రముఖ యూనివర్సిటీలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS), నన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) ఉన్నాయి. వీటితో పాటు సింగపూర్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన విద్యాసంస్థలు ఇవే..
* Singapore University of Technology and Design
* Singapore Management University
* Duke–NUS Graduate Medical School
* INSEAD – Singapore
* Nanyang Polytechnic
* London School of Business and Finance (Singapore Campus)
* Singapore Institute of Management
* Nanyang Business School
* PSB Academy
* NUS – Institute of Systems Science (NUS-ISS)
సింగపూర్ స్టూడెంట్ వీసా రకాలు, ఫీజులు
సింగపూర్‌లో చదవాలంటే సరైన స్టూడెంట్ వీసా అవసరం. కోర్సు వ్యవధి ఆధారంగా వీసా ఇస్తారు. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు మూడు నెలల వరకు ఉంటే Short-Term Pass అందిస్తారు. డిగ్రీ, మాస్టర్స్ వంటి దీర్ఘకాలిక చదువులకు Student Pass అవసరం. వీసా దరఖాస్తు మొత్తం SOLAR (Student’s Pass Online Application & Registration) సిస్టమ్ ద్వారా జరుగుతుంది.
వీసా ఫీజులు:
Student Pass జారీ ఫీజు: S$60
Multiple Journey Visa అవసరమైతే అదనంగా: S$30
ఫీజులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, Visa, MasterCard, AMEX కార్డుల ద్వారా చెల్లించవచ్చు. తాజా ఫీజు వివరాలు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయాలి.
స్టూడెంట్ వీసాకు అవసరమైన డాక్యుమెంట్లు
సింగపూర్ స్టడీ వీసా దరఖాస్తుకు సాధారణంగా అడిగే పత్రాలు ఇవే..
* కనీసం మూడు నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్
* పూర్తిగా నింపిన eForm 16, Form V36
* వీసా ఫీజు చెల్లింపు రసీదు
* సింగపూర్ ఉన్నత విద్యా సంస్థ నుంచి అడ్మిషన్ లేఖ
* IPA (In-Principal Approval) లేఖ
* తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
* బ్యాంక్ లోన్ సాంక్షన్ లేఖ ఉంటే దాని కాపీ
* విద్యార్హత సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు
* TOEFL, IELTS, GRE, GMAT వంటి పరీక్షల స్కోర్లు
* తాజా మెడికల్ సర్టిఫికెట్లు
* ఉద్యోగ అనుభవ వివరాలు ఉంటే
* సింగపూర్ వసతి వివరాలు
పార్ట్ టైమ్ ఉద్యోగాలు, చదువు తర్వాత అవకాశాలు
సింగపూర్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులకు పార్ట్ టైమ్ ఉద్యోగాల అవకాశం ఉంది. టర్మ్ సమయంలో వారానికి 16 గంటల వరకు పని చేయవచ్చు. సెలవుల సమయంలో పూర్తి సమయం పని చేయడానికి ప్రత్యేక వర్క్ పర్మిట్ అవసరం ఉండదు. ఈ సదుపాయం మీ విద్యాసంస్థకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే Ministry of Manpower అధికారిక వెబ్‌సైట్ చూడాలి. డిగ్రీ పూర్తి అయిన తరువాత విద్యార్థులు Long-Term Visit Pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాస్ ఒక సంవత్సరం చెల్లుతుంది. ఈ సమయంలో ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎంప్లాయర్ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

